Asianet News TeluguAsianet News Telugu

వధువుకి శీల పరీక్ష... ఫెయిల్ అయ్యిందంటూ..

ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదే గ్రామానికి చెందిన అన్నాదమ్ముళ్లను గతేడాది నవంబర్‌ 27న పెళ్లి చేసుకున్నారు. ఇది కంజర్భట్ తెగకు చెందిన వివాహం కావడంతో.. ఆ తెగ ఆచారం ప్రకారం పెళ్లైన వెంటనే వధువుకు కన్యత్వ పరీక్ష చేస్తారు.

Woman fails virginity test she and sister face divorce order from jaat panchayat
Author
Hyderabad, First Published Apr 10, 2021, 3:06 PM IST

అమ్మాయిలకు వర్జినిటీ టెస్ట్ అనేదే ఉండదు అని వైద్యులు చెబుతున్నారా.. ఇప్పటికీ.. ఆ పేరుతో మహిళలను మానసికంగా వేధిస్తున్నారు. పెళ్లి తర్వాత నిర్వహించే తొలి రాత్రిలో మహిళ కన్యగా తేలలేదంటూ నవ వధువుని ఇంటి నుంచి గెంటేశారు. అంత్యంత అమానవీయ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదే గ్రామానికి చెందిన అన్నాదమ్ముళ్లను గతేడాది నవంబర్‌ 27న పెళ్లి చేసుకున్నారు. ఇది కంజర్భట్ తెగకు చెందిన వివాహం కావడంతో.. ఆ తెగ ఆచారం ప్రకారం పెళ్లైన వెంటనే వధువుకు కన్యత్వ పరీక్ష చేస్తారు.


ఈ వర్జినిటీ టెస్ట్‌లో ఒక వధువు విఫలమైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కుల పెద్దలు పంచాయతీ నిర్వహించి వధువులిద్దరికీ విడాకులు ఇవ్వాలని తీర్పునిచ్చారు. అలాగే రూ.10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని వరుడి కుటంబానికి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే వధువు కుటుంబాన్ని కంజర్భట్ తెగ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారంపై అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios