అమృత్‌సర్: తక్కువ వయసులో ఎక్కువ డబ్బు సంపాదించాలనకుంది. అందుకు తన అందాన్ని పణంగా పెట్టింది. మ్యాట్రిమోనియల్ సంస్థలను బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడం, వివాహ తంతు పూర్తయ్యాక డబ్బు, నగలుతో పారిపోవడం మెుదలపెట్టింది.

ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఇక తనను అడ్డుకునేవారు లేరన్నట్లుగా ఆ యువతి ఇంకా రెచ్చిపోయింది. ఒక పెళ్లి చేసుకుటుంది ఆ తర్వాత నదు నగలుతో ఉడాయిస్తోంది. మళ్లీ పేరు మార్చుకుంటుంది, మతం కూడా మార్చుకుంటుంది మరోకరిని పెళ్లి చేసుకుని మళ్లీ డబ్బు, ఆభరణాలతో పరారీ. 

ఇప్పటికే  పలువురు యువకులను మోసం చేసిన ఆమె మరో యువకుడిని మోసం చేసి నగదు, నగలతో ఉడాయించగా అతను పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆమె అసలు బండారం బయటపడింది. 

వివరాల్లోకి వెళ్తే జమ్మూ కశ్మీర్ కు చెందిన అనీషా అనే యువతి మోసాలు చెయ్యడం అలవాటుగా మార్చుకుంది. కుమార్తె మోసాలు గమనించిన తండ్రి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. అయినా ఆమెలో మార్పురాలేదు సరికదా మరో మోసానికి దిగింది అనీషా. ఒక మ్యాట్రిమోనియల్‌ సంస్థ సహకారంతో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఆమె రాజపూత్ గా మారిపోయింది.

పంజాబ్ అమృత్ సర్ కు చెందిన రాజేష్ కుమార్ భాటియా తన కుమారుడి పెళ్లి కోసం ఒక మ్యాట్రిమోనిల్ సంస్థను సంప్రదించాడు. అయితే అనీషా రాజ్ పూత్ పేరుతో ఉన్న అనీషా నచ్చడంతో పెళ్లి చేశారు. పెళ్లయిన 15 రోజుల తర్వాత పెళ్లి కుమారుడు రాజేష్ కుమార్ భాటియా తనయుడు ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లిపోయాడు. 

భర్త దుబాయ్ వెళ్లిన తర్వాత అనీషా ఇంట్లోని నగలు, నగదు తీసుకుని మాయమైపోయింది. దీంతో రాజేష్ కుమార్ భాటియా అమృత్ సర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చండీగఢ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
అనీషా ఇంతకు ముందు కూడా పలువురు యువకులను పెళ్లి పేరుతో మోసగించిందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితురాలిని కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు.