ప్రేమ పేరుతో వలలో వేసుకుని.. పెళ్లి పేరుతో లోబర్చుకుని ఓ టాక్సీ డ్రైవర్ ఒక యువతిని మోసం చేశాడు. తీరా ఆమె పెళ్లికి పట్టుబడడంతో మాయమయ్యాడు. దీంతో పట్టువదలన యువతి అతని ఇంటికి వెళ్లి.. ఇంటిముందు నిరసనకు దిగింది. కానీ రోజులు గడుస్తున్నా..ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో...
ప్రేమ పేరుతో వలలో వేసుకుని.. పెళ్లి పేరుతో లోబర్చుకుని ఓ టాక్సీ డ్రైవర్ ఒక యువతిని మోసం చేశాడు. తీరా ఆమె పెళ్లికి పట్టుబడడంతో మాయమయ్యాడు. దీంతో పట్టువదలన యువతి అతని ఇంటికి వెళ్లి.. ఇంటిముందు నిరసనకు దిగింది. కానీ రోజులు గడుస్తున్నా..ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో...
చెన్నై : ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి ప్రియుడి ఇంటి ముందు suicideకు ప్రయత్నించింది. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా జోలార్ పేటలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. chennai అశోక్ నగర్ కు చెందిన యువతి (26) బ్యాంక్ లో పనిచేస్తోంది. ఈమెకు చెన్నైలో Taxi driverగా పనిచేస్తున్న తిరుపత్తూరు జిల్లా జోలార్ పేట సమీపంలోని అచ్చ మంగళం గ్రామానికి చెందిన రామన్ తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. marriage చేసుకుంటానని నమ్మించి రామన్ పలుమార్లు ఆమెపై Sexual assault చేశాడు. ఆ తరువాత వివాహం చేసుకోవాలని యువతి పట్టుబట్టడంతో Raman ఎవరికీ తెలియకుండా సొంతూరుకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి జనవరి 27న జోలార్ పేటలోని రామన్ ఇంటి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
అయితే, ఈ వివాహానికి వారు అంగీకరించకపోవడంతో యువతి రామన్ ఇంటి ముందే Protestకు కూర్చుంది. 9 రోజులైనా పట్టించుకోకపోవడంతో శుక్రవారం Sanitizer తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం siddipetలో ఓ constable దారుణానికి తెగబడ్డాడు. మూడేళ్లు ప్రేమిస్తున్నాని వెంటపడి, వేధించి.. చివరికి లోబరుచుకుని.. తీరా పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. దీంతో విసిగిపోయిన woman వేరే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత మళ్లీ మెసేజ్ లు, ఛాటింగులతో వెంటపడ్డాడు ఆ కానిస్టేబుల్.. భర్తను వదిలేసి వస్తే.. పెళ్లి చేసుకుంటాని నమ్మబలికాడు.. తీరా ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయికి ఎవ్వరికీ తెలీకుండా తాళి కట్టి.. కొద్ది రోజులు వాడుకుని.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆ యువతి తనకు న్యాయం చేయమంటూ అతని ఇంటిముందు ధర్నాకు దిగింది... ఈ ఘటన జనవరి 27న జరిగింది.
ప్రేమించి పెళ్ల చేసుకుంటానని నమ్మ బలికిన ప్రియుడు మాట తప్పడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూర్ మండల పరిధిలోని రామునిపట్లలో జనవరి 27న చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పల్లె విద్యను చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ యాసరేని సంతోష్ కుమార్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మ బలికాడు.
మాయమాటలు చెప్పి తనను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె నిలదీయగా మొహం చాటేశాడు. ఏడాది క్రితం ఇంట్లో వారి అంగీకారం మేరకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత సైతం ఫోన్ లో రోజు చాటింగ్ చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటానని.. తన వెంట రమ్మని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్లిన ఆమెను కరీంనగర్ లో ఒక అద్దె ఇంట్లో ఉంచాడు.
ఆ సమయంలో ఆమెకు మంగళసూత్రం కట్టాడు. ఇప్పుడు ఆమెకు కనబడకుండా తిరుగుతున్నాడు. దీంతో న్యాయం చేసే వరకు రామునిపట్లలో సంతోష్ కుమార్ ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది విద్య. ఆమెకు మద్ధతుగా వారి కుటుంబసభ్యులు నిలిచారు.
