దేశవ్యాప్తంగా కరోనావైరస్ అదుపులోకి వస్తోంది. లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు, ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. శుక్రవారం 19,20,477మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 84, 332 కొత్త కేసులు వెలుగు చూశాయి. వరుసగా ఐదోరోజూ లక్ష దిగువనే కేసులు నమోదయ్యాయి.

90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి. తాజాగా దేశంలో వైరస్ ఉద్ధృతి ఏప్రిల్ ప్రారంభం నాటి స్థాయికి తగ్గింది. అయితే గత మూడు రోజులుగా మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. 24గంటల వ్యవధిలో మరో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155 చేరగా.. 3,67,081 మంది బలయ్యారు.
ఇది నిన్న ఒక్కరోజే 1,21,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు నెల రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. అలాగే 2.79కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 3.68 శాతానికి తగ్గింది. క్రియాశీల కేసులు 10 లక్షలకు పడిపోయాయి. మరోపక్క నిన్న 34.3 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంక్య 25 కోట్ల మార్కుకు చేరువైంది.