ఒక జంటకు విడాకుల డిక్రీ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త హెచ్చరికను పట్టించుకోకుండా భార్య ఎవరికైనా రహస్యంగా విచక్షణతో ఫోన్ చేస్తే అది వైవాహిక క్రూరత్వంగా పరిగణించబడుతుందని కోర్టు పేర్కొంది. 

ఒక జంటకు విడాకుల డిక్రీ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త హెచ్చరికను పట్టించుకోకుండా భార్య ఎవరికైనా రహస్యంగా విచక్షణతో ఫోన్ చేస్తే అది వైవాహిక క్రూరత్వంగా పరిగణించబడుతుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు కేరళ హైకోర్టు తీర్పును లైవ్ లా రిపోర్ట్ చేసింది. వివరాలు.. 2012లో ఇద్దరు దంపతుల మధ్య వైవాహిక విబేధాలు ప్రారంభమయ్యాయి. భర్త, అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని భార్య ఫిర్యాదు చేసింది. మరోవైపు తన భార్యకుపెళ్లికి ముందు మరోక వ్యక్తితో సంబంధం ఉందని భర్త అనుమానించాడు.

ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం, క్రూరత్వం కారణంగా వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అయితే అతని అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు కొట్టివేయబడింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. పెళ్లయిన నాటి నుంచి భార్య అనేక అకృత్యాలకు పాల్పడి తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుందని భర్త చెబుతున్నాడు. పెళ్లికి ముందు నుంచే ఆమెకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆరోపించాడు. 

భర్త తరఫున వాదించిన న్యాయమూర్తి.. కాల్ డేటాను పరిశీలించాలని కోర్డును కోరాడు. అది వివాహేతర సంబంధాన్ని సూచిస్తుందని తెలిపారు. అయితే భార్య తరఫున వాదించిన లాయర్.. తన క్లెయింట్ మరో వ్యక్తిని(రెండో ప్రతివాది) official purposes మీదనే అప్పుడప్పుడు అతనికి కాల్ చేసేదని తెలిపారు.

అయితే కేవలం తరుచూ కాల్స్ చేస్తుందనే కారణంగా.. ప్రతివాదుల మధ్య వివాహేతర సంబంధం ఉందనే నిర్దారణకు రాలేమని కోర్టు అభిప్రాయపడింది. భర్త సమర్పించిన సాక్ష్యం వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని నిరూపించడానికి సరిపోదని తెలిపింది. అయితే భార్య రాత్రి సమయాల్లో రెండో ప్రతివాదికి కాల్ చేసినట్టుగా డేటా ఉందని.. వివాహేతర సంబంధాన్ని అంచనా వేయడానికి ఈ సాక్ష్యం సరిపోదని.. అయితే అలాంటి కాల్స్ చేయడం మానసిక క్రూరత్వానికి కారణమవుతుందా అనేది సంబంధిత ప్రశ్న అని Justice Kauser Edappagth పేర్కొన్నారు.

వివాహం జరిగినప్పటి నుంచి దంపతుల మధ్య వైవాహిక సంబంధం స్నేహపూర్వకంగా లేదని కోర్టు గుర్తు చేసింది. వాస్తవానికి.. వారు మూడుసార్లు విడిపోయారు.. తిరిగి కలుసుకున్నారు.. అనేక సార్లు మధ్యవర్తిత్వం, రాజీ జరిగింది. అటువంటి పరిస్థితుల్లో భార్య ప్రవర్తనలో మరింత అప్రమత్తంగా ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘భర్త చెప్పిన ప్రకారం.. అతను హెచ్చరించినప్పటికీ, ఆమె రెండవ ప్రతివాదితో కాల్స్ చేస్తూనే ఉంది. రెండవ ప్రతివాదితో ఆమె టెలిఫోన్ సంభాషణ గురించి భర్త ప్రశ్నించిన తర్వాత కూడా దానిని కొనసాగించింది. భర్తకు ఇష్టం లేదని ఆమె గ్రహించిన తర్వాత కూడా ఇది జరిగింది. ఆమె రెండవ ప్రతివాదితో దాదాపు అన్ని రోజులు టెలిఫోన్ సంభాషణను కొనసాగించింది’ అని తీర్పు పేర్కొంది.

రాజీ తర్వాత భార్యాభర్తల మధ్య నిజమైన దాంపత్య జీవితం పున:ప్రారంభించ బడుతుందని సూచించడానికి ఎటువంటి మెటీరియల్ రికార్డులో లేదని.. అటువంటి పరిస్థితులలో ఈ జంటకు విడాకులు మంజూరు చేయడానికి తగిని కేసుగా న్యాయస్థానం గుర్తించింది.