నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Wednesday 31st august telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
9:08 PM IST

ఢిల్లీలో తొలి వర్చువల్ పాఠశాల

విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తోన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ప్రారంభించారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా నడవనున్న ఈ స్కూల్ అడ్మిషన్లు నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా వర్చువల్ మోడ్‌లో విద్యార్ధులు క్లాసులకు హాజరుకావొచ్చని సీఎం తెలిపారు. 

8:22 PM IST

క్రికెట్‌కు న్యూజిలాండ్ క్రికెటర్ గ్రాండ్‌హోమ్ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ క్రికెటర్ గ్రాండ్‌హోమ్ గుడ్‌బై చెప్పారు. కివీస్ తరపున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడారు గ్రాండ్ హోమ్. దీంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

7:46 PM IST

ఈ త్రైమాసికంలో భారత ఆర్ధిక వృద్ధి 13.5 శాతం

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ 13.5 శాతం వృద్దిని నమోదు చేసినట్లు కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. నిరుడు ఇదే సమయంలో దేశ జీడీపీ 20.1 శాతం కావడం గమనార్హం. ఆర్బీఐ సహా పలు అంతర్జాతీయ సంస్థలు వేసిన అంచనాలకు దూరంగా ఈ వృద్ధి నమోదైంది. 

6:54 PM IST

లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ

బీహార్ పర్యటనలో భాగంగా ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. 

6:24 PM IST

సోనియా గాంధీ తల్లి కన్నుమూత

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పావోలా మైనో ఆగస్టు 27న ఇటలీలో కన్నుమూశారు. ఆగస్ట్ 30న ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. 

4:57 PM IST

దేశ చరిత్రలో ఒకేఒక్కడు కేసీఆర్... బిహార్ సీఎం నితీష్ ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించి.... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు నూతన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచారని నితీష్ కొనియాడారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్ అంటూ బిహార్ సీఎం కొనియాడారు. 
 
4:08 PM IST

ఆప్ పై లీగల్ యాక్షన్ కు సిద్దమైన డిల్లీ లెప్టినెంట్ గవర్నర్

తనపై అవినీతి ఆరోపణలు చేసిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలకు సిద్దమయ్యారు డిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు . ఆప్ ఎమ్మెల్యేల ఆరోపణలపై ఎల్జీ స్పందిస్తూ... రూ.1400 కోట్ల అవినీతికి పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలన్ని ఊహాజనితమేనని అన్నారు. 

3:21 PM IST

రాజాసింగ్ అరెస్ట్ కు నిరసనగా... ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఆందోళన

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP), భజరంగ్ దళ్ నేతలు ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం ముందు ఆందోళనకు కూర్చుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
2:21 PM IST

పాట్నా చేరుకున్న కేసీఆర్... సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వి స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిహార్ లో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కేసీఆర్ పాట్నా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేసీఆర్ కు బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్వాగతం పలికారు. 
 
1:38 PM IST

హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన మరువకముందే తాజాగా హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  
 
1:03 PM IST

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ అద్భుత విజయం

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ నెంబర్ 4 ర్యాంకర్ లీ జియాపై అద్భుత విజయం సాధించాడు. అయితే కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ 21 ర్యాంకర్ కెంటా నిషిమోటోపై 21-18 14-21 13-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి తప్పుకున్నాడు. 

12:16 PM IST

బిహార్ పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ బిహార్ కు బయలుదేరారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న కేసీఆర్ ఎన్డీఏ నుండి బయటకువచ్చిన తర్వాత మొదటిసారి జేడియు అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ను కలుస్తున్నారు. వీరి భేటీపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

11:03 AM IST

తెలంగాణకు కేంద్రం మరో షాక్... ఏపీకి భారీ ప్రాజెక్ట్ మంజూరు

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలను నెల రోజుల్లోపుగా చెల్లించాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కోరినప్పటికి బల్క్ డ్రగ్ పార్క్ ను ఏపీకే కేటాయించింది కేంద్రం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీపడినా ఆంధ్ర ప్రదేశ్ కే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది. 

10:22 AM IST

భారత్ లో తాజాగా 7,231 కరోనా కేసులు

భారత్ లో గత 24 గంటల్లో 7,231 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 4,44,28,393 కు చేరాయి. అలాగే దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,27,874 కు చేరాయి. 

9:36 AM IST

యూఎస్ ఓపెన్ లో  సంచలనం... డిపెండింగ్ ఛాంపియన్ రాడుకాను ఇంటిబాట

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్స్ మహిళల సింగిల్స్ విభాగంలో డిపెడింగ్ ఛాంపియన్ ఎమ్మా రాడుకాను తొలిరౌండ్ లో ఇంటిబాట పట్టింది. ప్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి కార్నెట్ చేతిలో బ్రిటన్ స్టార్ రాడుకాను 6‌‌-3, 6-3 తేడాతో ఓటమిపాలయ్యింది.  గతేడాది అద్భుత ప్రదర్శనతో యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన రాడుకాను ఈసారి తొలిరౌండ్ లోనే పరాజయం పాలవడం టెన్నిస్ ప్రియులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. 
 
9:25 AM IST

ప్రజలకుపీఎం మోదీ , తెలుగు సీఎంల వినాయక చవితి శుభాాకాంక్షలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 

9:08 PM IST:

విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తోన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ప్రారంభించారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా నడవనున్న ఈ స్కూల్ అడ్మిషన్లు నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా వర్చువల్ మోడ్‌లో విద్యార్ధులు క్లాసులకు హాజరుకావొచ్చని సీఎం తెలిపారు. 

8:22 PM IST:

అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ క్రికెటర్ గ్రాండ్‌హోమ్ గుడ్‌బై చెప్పారు. కివీస్ తరపున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడారు గ్రాండ్ హోమ్. దీంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

7:46 PM IST:

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ 13.5 శాతం వృద్దిని నమోదు చేసినట్లు కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. నిరుడు ఇదే సమయంలో దేశ జీడీపీ 20.1 శాతం కావడం గమనార్హం. ఆర్బీఐ సహా పలు అంతర్జాతీయ సంస్థలు వేసిన అంచనాలకు దూరంగా ఈ వృద్ధి నమోదైంది. 

6:54 PM IST:

బీహార్ పర్యటనలో భాగంగా ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. 

6:24 PM IST:

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పావోలా మైనో ఆగస్టు 27న ఇటలీలో కన్నుమూశారు. ఆగస్ట్ 30న ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. 

4:58 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించి.... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు నూతన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచారని నితీష్ కొనియాడారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్ అంటూ బిహార్ సీఎం కొనియాడారు. 
 
4:08 PM IST:

తనపై అవినీతి ఆరోపణలు చేసిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలకు సిద్దమయ్యారు డిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు . ఆప్ ఎమ్మెల్యేల ఆరోపణలపై ఎల్జీ స్పందిస్తూ... రూ.1400 కోట్ల అవినీతికి పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలన్ని ఊహాజనితమేనని అన్నారు. 

3:21 PM IST:

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP), భజరంగ్ దళ్ నేతలు ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం ముందు ఆందోళనకు కూర్చుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
2:21 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిహార్ లో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కేసీఆర్ పాట్నా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేసీఆర్ కు బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్వాగతం పలికారు. 
 
1:39 PM IST:

తెలంగాణలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన మరువకముందే తాజాగా హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  
 
1:04 PM IST:

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ నెంబర్ 4 ర్యాంకర్ లీ జియాపై అద్భుత విజయం సాధించాడు. అయితే కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ 21 ర్యాంకర్ కెంటా నిషిమోటోపై 21-18 14-21 13-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి తప్పుకున్నాడు. 

12:16 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ బిహార్ కు బయలుదేరారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న కేసీఆర్ ఎన్డీఏ నుండి బయటకువచ్చిన తర్వాత మొదటిసారి జేడియు అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ను కలుస్తున్నారు. వీరి భేటీపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

11:04 AM IST:

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలను నెల రోజుల్లోపుగా చెల్లించాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కోరినప్పటికి బల్క్ డ్రగ్ పార్క్ ను ఏపీకే కేటాయించింది కేంద్రం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీపడినా ఆంధ్ర ప్రదేశ్ కే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది. 

10:22 AM IST:

భారత్ లో గత 24 గంటల్లో 7,231 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 4,44,28,393 కు చేరాయి. అలాగే దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,27,874 కు చేరాయి. 

9:37 AM IST:

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్స్ మహిళల సింగిల్స్ విభాగంలో డిపెడింగ్ ఛాంపియన్ ఎమ్మా రాడుకాను తొలిరౌండ్ లో ఇంటిబాట పట్టింది. ప్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి కార్నెట్ చేతిలో బ్రిటన్ స్టార్ రాడుకాను 6‌‌-3, 6-3 తేడాతో ఓటమిపాలయ్యింది.  గతేడాది అద్భుత ప్రదర్శనతో యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన రాడుకాను ఈసారి తొలిరౌండ్ లోనే పరాజయం పాలవడం టెన్నిస్ ప్రియులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. 
 
9:25 AM IST: