నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Wednesday 21st September Telugu News

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:23 PM IST

తెలంగాణలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్

రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్) ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. ఒక్కో దాని కోసం రూ. 3.60 కోట్ల చొప్పున మొత్తం రూ. 43.20 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వీటి ఏర్పాటు వల్ల రోగులకు వెంటనే మందులు అందుతాయి. 
 
8:50 PM IST

ఉప్పల్ స్టేడియంలో టికెట్ల విక్రయాలపై శ్రీనివాస్ గౌడ్ స్పందన

ఈ నెల 25న భారత్- ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాలు ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల విక్రయాల్లో అవకతవకలపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. 
 
7:53 PM IST

తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణలో రేపటి నుంచి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. దాదాపు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. 

7:05 PM IST

జగన్‌కు ఈసీ షాక్

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు వుండడని ఈసీ వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి తమకు నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

5:45 PM IST

టీడీపీ సభ్యులపై స్పీకర్ సీరియస్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ మండిపడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీకి ఆయన సిఫారసు చేశారు. 
 
3:48 PM IST

నేడు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 262 పాయింట్లు నష్టపోయి 59,456 వద్ద, నిప్టి 97 పాయింట్ల నష్టంతో 17,718 వద్ద స్థిరపడ్డాయి. 

3:09 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్దమే..: అశోక్ గెహ్లాట్ సంచలనం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ శ్రేణులు కోరుకుంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి సిద్దమేనని ప్రకటించారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించడానికి సిద్దంగా వున్నానని గెహ్లాట్ పేర్కొన్నారు. 

2:07 PM IST

ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి..: టిపిసిసి తీర్మానం

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. ఏఐసిసి చీఫ్ పదవికోసం ఎన్నికలు జరుగుతున్న సమయంలో అన్ని రాష్ట్రాలు రాహుల్ నే అధ్యక్షున్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన విస్తృతస్థాయి మీటింగ్ లో రాహుల్ కు మద్దతుగా తీర్మానం చేసారు.  
 
1:03 PM IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం...

ఏపీలో రాజకీయ దుమారం రేపిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్ష టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో వారిని సస్పెండ్  చేసి ఈ బిల్లును ఆమోదింపచేసుకుంది వైసిపి సర్కార్. 
 
11:49 AM IST

ఎన్టిఆర్ పేరు మార్పు వివాదం... అధికారిక బాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ రాజీనామా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేసారు. వైఎస్సార్ పేరు పెట్టాలన్న నిర్ణయం బాగానే వున్నా ఎన్టీఆర్ పేరు తొలగించడం తనను బాధించిందని... అందుకే రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ ప్రకటించారు. 

10:31 AM IST

దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కు అరుదైన వ్యాధి...

ప్రపంచ దిగ్గజ భాక్సర్, ఇటీవలే లైగర్ సినిమాతో యాక్టర్ గా మారిన మైక్ టైసన్ అరుదైన వ్యాధి బారినపడ్డారు. తీవ్ర వెన్నునొప్పిని కలిగించే సయాటికా అనే వ్యాధితో బాధపడుతున్న టైసన్ వీల్ చెయిర్ పై వెళుతున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. వెన్నునొప్పి కారణంగా ఒక్కోసారి మాట్లాడలేని పరిస్థితి వస్తోందని టైసన్ తెలిపారు. 

9:35 AM IST

స్పీకర్ పోడియం చుట్టుముట్టి టిడిపి ఆందోళన... ఏపీ అసెంబ్లీ వాయిదా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో టిడిపి ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియం పైకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. స్పీకర్ పై పేపర్లు చించి విసిరారు. దీంతో శాసనసభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేసారు. 

9:30 AM IST

డిల్లీలో ఘోరం... ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు... నలుగురు మృతి

దేశ రాజధాని న్యూడిల్లీలో తెల్లవారుజామున ఘోరం జరిగింది. సీమాపురి రోడ్డులో వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

9:23 AM IST

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై టిడిపి ఆందోళన

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి ఆందోళన చేపట్టింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. 
 
9:23 PM IST:

రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్) ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. ఒక్కో దాని కోసం రూ. 3.60 కోట్ల చొప్పున మొత్తం రూ. 43.20 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వీటి ఏర్పాటు వల్ల రోగులకు వెంటనే మందులు అందుతాయి. 
 
8:50 PM IST:

ఈ నెల 25న భారత్- ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాలు ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల విక్రయాల్లో అవకతవకలపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. 
 
7:53 PM IST:

తెలంగాణలో రేపటి నుంచి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. దాదాపు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. 

7:05 PM IST:

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు వుండడని ఈసీ వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి తమకు నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

5:45 PM IST:

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ మండిపడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీకి ఆయన సిఫారసు చేశారు. 
 
3:48 PM IST:

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 262 పాయింట్లు నష్టపోయి 59,456 వద్ద, నిప్టి 97 పాయింట్ల నష్టంతో 17,718 వద్ద స్థిరపడ్డాయి. 

3:09 PM IST:

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ శ్రేణులు కోరుకుంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి సిద్దమేనని ప్రకటించారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించడానికి సిద్దంగా వున్నానని గెహ్లాట్ పేర్కొన్నారు. 

2:07 PM IST:

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. ఏఐసిసి చీఫ్ పదవికోసం ఎన్నికలు జరుగుతున్న సమయంలో అన్ని రాష్ట్రాలు రాహుల్ నే అధ్యక్షున్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన విస్తృతస్థాయి మీటింగ్ లో రాహుల్ కు మద్దతుగా తీర్మానం చేసారు.  
 
1:03 PM IST:

ఏపీలో రాజకీయ దుమారం రేపిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్ష టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో వారిని సస్పెండ్  చేసి ఈ బిల్లును ఆమోదింపచేసుకుంది వైసిపి సర్కార్. 
 
11:49 AM IST:

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేసారు. వైఎస్సార్ పేరు పెట్టాలన్న నిర్ణయం బాగానే వున్నా ఎన్టీఆర్ పేరు తొలగించడం తనను బాధించిందని... అందుకే రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ ప్రకటించారు. 

10:31 AM IST:

ప్రపంచ దిగ్గజ భాక్సర్, ఇటీవలే లైగర్ సినిమాతో యాక్టర్ గా మారిన మైక్ టైసన్ అరుదైన వ్యాధి బారినపడ్డారు. తీవ్ర వెన్నునొప్పిని కలిగించే సయాటికా అనే వ్యాధితో బాధపడుతున్న టైసన్ వీల్ చెయిర్ పై వెళుతున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. వెన్నునొప్పి కారణంగా ఒక్కోసారి మాట్లాడలేని పరిస్థితి వస్తోందని టైసన్ తెలిపారు. 

9:35 AM IST:

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో టిడిపి ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియం పైకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. స్పీకర్ పై పేపర్లు చించి విసిరారు. దీంతో శాసనసభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేసారు. 

9:30 AM IST:

దేశ రాజధాని న్యూడిల్లీలో తెల్లవారుజామున ఘోరం జరిగింది. సీమాపురి రోడ్డులో వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

9:23 AM IST: