ఇండియా వచ్చినప్పుడు జస్టిన్ ట్రూడో డ్రగ్స్ మత్తులో ఉన్నాడా? కెనడా పీఎంవో కామెంట్ ఇదే
జీ 20 సమావేశాల్లో పాల్గొనడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌కు వచ్చినప్పుడు ఆయన విమానం నిండా కొకైన్ ఉందని, ఆయన కూడా మత్తులో ఉన్నాడని భారత మాజీ దౌత్య అధికారి దీపక్ వోహ్రా ఓ టవీ చానెల్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు గదిలో నుంచి బయటకు రానేలేదని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను కెనడా పీఎంవో ఖండించింది.

న్యూఢిల్లీ: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ప్రతికూల వాతావరణం నెలకొంది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేంద్రంగా ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పై భారత్‌లోనూ తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ రిటైర్డ్ డిప్లమాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్‌లో మాట్లాడుతూ.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ వచ్చినప్పుడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడని కామెంట్ చేశారు.
జీ 20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో జరిగినప్పుడు కెనడా పీఎం జస్టిన్ ట్రూడో వచ్చిన ఫ్లైట్ నిండా కొకైన్ ఉన్నదని, మన ఆర్మీ స్నిఫర్ డాగ్స్ దీన్ని గుర్తించాయని మాజీ దౌత్య అధికారి దీపక్ వోహ్రా అన్నారు. అంతేకాదు, ఢిల్లీలో ఆయన రెండు రోజులు గది నుంచి బయటకు రాలేదని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో పాల్గొనలేదని కామెంట్ చేశారు.
Also Read: భార్యతో వీడియో కాల్‌లో గొడవ.. గర్ల్‌ఫ్రెండ్ ముందే షూట్ చేసుకుని ఆత్మహత్య
ఈ కామెంట్లపై కెనడా ప్రధాని కార్యాలయం స్పందించింది. ఇది పచ్చి అబద్ధం అని స్పష్టం చేసింది. మీడియా రిపోర్టింగ్‌లోకి తప్పుడు సమాచారం ఎలా చేరుతుందో అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అని పేర్కొంది.