Asianet News TeluguAsianet News Telugu

Voting Ink History: ఎన్నికల సిరా.. ఎక్కడ? ఎలా తయారు చేస్తారో తెలుసా..!  

Voting Ink History: ఓటు వేసిన తర్వాత ఓటరు వేలిపై సిరా గుర్తును వేస్తారు. దీనినే ఇన్‌క్రెడిబుల్ ఇంక్ అని అన్నారు. అయితే.. ఈ ఇంక్ ను ఎక్కడ తయారు చేస్తారు? ఎందుకు ఆ సిరా త్వరగా చెరిగిపోదు. ఇంతకీ ఎన్నికల సిరా చరిత్రేంటీ? 

Voting Ink History The indelible ink used in Indian elections KRJ
Author
First Published Mar 16, 2024, 12:27 AM IST

Voting Ink History: ప్రజాస్వామ్యంలో అందరూ సమానమైన అని చెప్పే ఏకైక సాధనం ఓటు హక్కు. బాధ్యతగల పౌరుడిగా మనంసమాజం గుర్తించాలంటే తప్పనిసరిగా ఆ  శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఎన్నికల సమయంలో ఓటుకు అంత విలువ. ఓటరుకు గొప్పతనం.కానీ ప్రస్తుతం ఎన్నికలకు అర్థాలే మారిపోయాయి. రాజకీయ నేతల దగ్గర్నుంచి ఓటరును, అతని ఓటు హక్కును ఓ  కమర్షియల్ ఎలిమెంట్స్ గా మార్చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే..

ఓటరు రాజకీయ పార్టీలకు ఎసెన్షియల్ కమోడిటీ గా మారిపోయాడు. ఎన్ని సంస్కరణలు వచ్చినా.. అవి కాగితాలపై చిత్తు రాతలుగానే మిగిలిపోయాయి. కానీ, ఓ పౌరునిగా మన బాధ్యత అయినా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుని తీరాలి. అలాంటి శక్తివంతమైన ఓటు వేశారా అంటే వేస్తామని చెప్పుకునేందుకు మన దగ్గర ఉండే ఏకైక సాక్ష్యం సిరాచుక్క. అవును సిరా చుక్కనే. ఎన్నికలు రాగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది వేలికి పెట్టే సిరాచుక్క. ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నాక మరోసారి దొంగ ఓటు వేయకుండా.. రీసైక్లింగ్ అరికట్టడానికి భారతీయ ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. ఇలా సిరా చుక్క  చరిత్రేంటో తెలుసుకుందాం. 

ఇంతకీ ఆ  సిరా ఎక్కడ తయారు అవుతుంది? 

కర్ణాటకలోని మైసూర్ లో మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నీష్ లో ఈ సిరా చుక్క తయారవుతోంది.  ఆ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని సిరా ఉత్పత్తి అవుతోంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  ఎన్నికలకు మైసూర్ లో తయారు అయ్యే.. సిరాను వాడుతున్నారు. 1937లో అప్పటి మైసూర్ మహారాజు కృష్ణరాజ వడియార్ 4 ఈ కర్మగారాన్ని స్థాపించారు. స్వతంత్రానికి ముందు వరకు ఈ కార్మగారం రాజు ఆధీనంలో ఉండగా అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వపరమైంది. 1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నీష్ కర్మాగారం ఉత్పత్తి చేస్తున్న సిరానే వినియోగిస్తున్నారు.  
 
అసలు సిరా ఎందుకు చెరిగిపోదు.. 

 సిరాలో 7 నుంచి 25% వరకు సిల్వర్ నైట్రేట్ ఉన్నందున ఆ సిరా వెంటనే చెరిగిపోదు. ఇది నేరేడు రంగులో ఉంటుంది. ఓటు వేసే ముందు ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలు పై పోలింగ్ సిబ్బంది సిరాతో ఒక గీతను వేస్తారు. ఇదే ఓటు హక్కును వినియోగించుకున్న అనడానికి గుర్తు. ఓటర్ ఒక్కసారి ఓటును వినియోగించుకోవాలి. రెండోసారి ఓటు వేయకుండా ఈ చుక్క వేస్తారు. ఒకసారి వేలుపై సిరా గుర్తు వేస్తే దాదాపు 72 గంటల వరకు చెరిగిపోదు. అదే చర్మంపై పడితే 76 నుంచి 96 గంటల వరకు ఉంటుంది. వాస్తవానికి మొదట్లో ఎడమ చేతికి వేలు పై స్థిరా చుక్కను పెట్టేవారు. కానీ, 2006 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి వేలు గోరుపై గీతగా పెడుతున్నారు. 

 ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారంటే..? 

 మనదేశంలో తయారవుతున్న ఈ సిరాకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ప్రపంచంలో పలు దేశాలకు ఇక్కడి నుంచే సిరా ఎగుమతి అవుతుంది.  ఆఫ్గానిస్థాన్, అల్జీరియా, ఇండోనేషియా, పాకిస్తాన్, మలేషియా, మయన్మార్, నేపాల్, పెరు,  ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సుడాన్ తదితర దేశాల్లో ఈ సిరానే వినియోగిస్తున్నారు. 

ఎన్నికల సిరాకు డిమాండ్.

ఈసారి ఎన్నికల సిరాకు డిమాండ్ పెరిగిపోయింది. అదే సమయంలో  సిరా ఖరీదు సైతం చాలా పెరిగింది. గత ఎన్నికల నాటి ధరతో పోలిస్తే.. రెట్టింపు కంటే ఎక్కువైంది. అలాగే.. రాయుడు లేబరేటరీస్ హైదరాబాద్ లో తయారయ్యే సిరాను మన రాష్ట్రంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించడంతోపాటు పిల్లలకు పోయే చుక్కలు వేసే సమయంలో గుర్తుపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. దాదాపు  100కు పైగా ఆఫ్రికన్ దేశాలు ఎన్నికలకు ఈ సిరానే సరఫరా అవుతుంది. ఈ ల్యాబ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డెవలప్మెంట్ .. యూనిసెఫ్ గుర్తింపు కూడా పొందింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios