Voting Identity Cards : ఓటరుగా నమోదు చేసుకుని, ఓటర్ ఐడీ కార్డు లేని వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీ కార్డుకు బదులుగా మరో 12 గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క కార్డు ఉన్నా సదరు ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇంతకీ ఆ 12  గుర్తింపు కార్డు లేంటీ?  

Voting Identity Cards: ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఆయుధం ఓటు. బాధ్యతగల పౌరుడిగా మనల్నీ గుర్తించాలంటే తప్పనిసరిగా ఆ శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఎన్నికల సమయంలో ఓటుకు అంత విలువ. అయితే.. మనం ఓటు హక్కును వినియోగించుకోవాలంటే.. ఓటింగ్ లిస్టులో ఓటరు పేరు తప్పనిసరిగా ఉండాలి. అలాగే.. ఓటర్ ఐడీ కూడా ఉండాలి.

కానీ.. ఓటరు ఐడీ కార్డు లేకున్నా ఎన్నికల్లో ఓటు వేసే వెసులుబాటునుకల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం . ఎన్నికల సమయంలో ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు దొరకకపోతే.. లేదా పోగొట్టుకుంటే.. ఆ సమయంలో ఓటు హక్కు అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు కార్డు లేకపోయినా దాదాపు 12 ఐడీలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ గుర్తింపు పత్రాలను చూపడం ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 

ఇవే ఆ 12 డాక్యుమెంట్స్ 

  • ఆధార్ కార్డ్, 
  • MNREGA జాబ్ కార్డ్, 
  • డ్రైవింగ్ లైసెన్స్, 
  • పాన్ కార్డ్,
  • ఇండియన్ పాస్‌పోర్ట్, 
  • పెన్షన్ కార్డ్, గవర్నమెంట్ సర్వీస్ కార్డ్, 
  • ఫోటోతో పాస్‌బుక్, స్మార్ట్ కార్డ్, 
  • హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, 
  • అధికారిక గుర్తింపు కార్డ్, 
  • ప్రత్యేక అంగవైకల్య కార్డ్

పై పేర్కొన్న ఏదైన ఒక కార్డు తీసుకెళ్లి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.