కరోనా జీవితం జూమ్ మీటింగుల్లో చిక్కుకుపోయింది. వర్క్ ఫ్రం హోం లు.. వీడియో కాల్స్ సర్వసాధారణం అయిపోయాయి. అయితే జూమ్ మీటింగ్ లో అప్పుడప్పుడూ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అలాంటి  ఓ చిలిపి సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఒక ఎనలిస్టు, జూమ్ మీటింగ్ లో దేశ జీడీపీపై చాలా సీరియస్ గా ఎనలైజ్ చేస్తున్నారు. ఇంతలో వెనకనుండి ఒక మహిళ సడెన్ గా వచ్చి ఆయనను ముద్దు పెట్టుకోబోయింది. దీనికి హతశుడైన భర్త.. వాట్ నాన్‌సెన్స్‌..కెమెరా ఆన్‌లో ఉంది అంటూ చిరు కోపాన్ని ప్రదర్శించారు. 

అయితే ఆమె మాత్రం దీన్ని పట్టించుకోకుండా నవ్వుల పువ్వులు విసిరింది. ఆమె రెస్పాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వీరి నడివయసు ఫన్నీ రొమాన్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే మరికొంతమంది నెటిజన్లు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. 

వాళ్ల ప్రైవసీ మాటేమిటి, ఇది చూస్తే వాళ్ల పిల్లలముందు పరువు పోదా అంటూ ఈ క్లిప్పింగ్ వైరల్ అవడం మీద కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి జీవితాల్లోని ఆప్యాయత అనురాగాలకు ఇది నిదర్శనమని మరికొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకొంతమంది ప్రేమగల తల్లిదండ్రుల్ని చూసిన  పిల్లలు సంతోషిస్తారని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.  అయితే ఇంకొంతమంది  భర్తగా అతని వ్యక్తీకరణ చాలా మొరటుగా ఉందని కామెంట్ చేస్తే.. ఆవిడ ఆయన భార్య కాదేమో.. అని కొంతమంది చిలిపి నెటిజన్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు.