Asianet News TeluguAsianet News Telugu

డ్రైవర్ లేకుండా... ట్రాక్టర్ ఎలా కదిలిందబ్బా...?

అదే ప్రాంతానికి చెందిన కిషన్ కుమార్ అనే వ్యక్తి తన ట్రాక్టర్ ని షోరూమ్ ముందు పార్క్ చేసి ఏదో పని మీద బయటకు వెళ్లాడు. దాదాపు గంట సేపు ఆ ట్రాక్టర్ అక్కడే కదలకుండా ఉంది.

Viral video shows tractor starting on its own, entering shop in UP's Bijnor
Author
First Published Mar 3, 2023, 9:40 AM IST

ఓ షోరూమ్ లో వింత సంఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే షోరూమ్ ఎదురుగా ఉన్న ఓ ట్రాక్టర్    సడెన్ గా దానంతట అదే స్టార్ట్ అయ్యింది. అక్కడితో ఆగలేదు. స్టార్ట్ అయ్యి.... దాని ముందు ఉన్న వస్తువులను నెట్టుకుంటూ ముందుకు వచ్చి.... గాజు అద్దాన్ని కూడా బ్రేక్ చేసింది. దానిని ఆపడానికి షోరూమ్ లోని ఉద్యోగులు నానా తిప్పలు పడ్డారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా..... ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ ప్రాంతంలో ఉన్న ఓ షోరూమ్. అందులో చాలా రకాల వాహనాలు ఉన్నాయి. ఉద్యోగులు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. అయితే.... అదే ప్రాంతానికి చెందిన కిషన్ కుమార్ అనే వ్యక్తి తన ట్రాక్టర్ ని షోరూమ్ ముందు పార్క్ చేసి ఏదో పని మీద బయటకు వెళ్లాడు. దాదాపు గంట సేపు ఆ ట్రాక్టర్ అక్కడే కదలకుండా ఉంది.

 

 సడెన్ గా ట్రాక్టర్ ఎవరో స్టార్ట్ చేసినట్లుగా దానంతట అదే స్టార్ట్ అయ్యింది. సరే.. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్టార్ట్ అయ్యిందిలే అనుకోవచ్చు. కానీ... అది కదిలి ముందుకు కూడా రావడం గమనార్హం. దాని ముందు ఉన్న వాహనాలను నెట్టుకుంటూ మరీ ముందుకు వచ్చింది. ఎదురుగా గ్లాస్ డోర్ ఉంటే దానిని కూడా అది బ్రేక్ చేయడం గమనార్హం. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా ఈ సీన్ జరగడం విశేషం. అది రాత్రి పూట కూడా కాదు. డే టైమ్ లో అందరూ చూస్తుండగానే ఇది జరిగింది. దానిని ఇద్దరు ఉద్యోగులు వెళ్లి.... దానిని ఆపడం విశేషం. ఈ వీడియో నెట్టింట షేర్ చేయగా వైరల్ గా మారింది.

ట్రాక్టర్ ఎలా కదిలింది అనే విషయం మాత్రం తెలియలేదు. ఆ ట్రాక్టర్ పక్కన పార్క్ చేసిన కొన్ని బైకులు కూడా  ధ్వసం అయ్యాయి. కాగా... ఈ వీడియోకి నెటిజన్ల రియాక్షన్ మాత్రం అదిరిపోయింది. డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ ఎలా కదిలిందబ్బా అని కొందరు కామెంట్ చేయగా..? దెయ్యం ఏమైనా వచ్చి స్టార్ట్ చేసిందా అని కొందరు కామెంట్స్ చేయడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios