Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే... భారీ మూల్యం చెల్లించక తప్పదు

ర్యాష్ డ్రైవింగ్ కి రూ.వెయ్యి నుంచి రూ.5వేలకు వరకు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇక మద్యం సేవించి పట్టుపడితే మాత్రం రూ.పది వేల వరకు చెల్లించాలి. 

Violating traffic rules to cost dear from September as new norms come into effect
Author
Hyderabad, First Published Aug 21, 2019, 4:26 PM IST

ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే... భారీ మూల్యం చెల్లించక తప్పదు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అములులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ కొత్త నిబంధనలను సెప్టెంబర్ 1, 2019 నుంచి అమలులోకి తీసుకువస్తుంది. 

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి భారీ పెనాల్టీ , జరిమానా విధించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టాన్ని సవరించినట్లు తెలుస్తోంది. ఈ సవరించిన చట్టం ప్రకారం... అత్యవసర వాహనాలు( అంబులెన్స్ లాంటివి) లకు మార్గం ఇవ్వకుండా రోడ్డుకి అడ్డంగా వాహనాలను ఆపితే.. వారికి రూ.10వేల జరిమానా విధించే అవకాశం ఉంది.

వాహనం నడిపే వ్యక్తికి డ్రైవర్ గా అర్హత లేకపోయినా కూడా రూ.పదివేల జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. రూ.100 జరిమానా విధించేవారు. ఇక నుంచి వాటన్నిటికీ రూ.500 ఫైన్ వేయనున్నారు. ట్రాఫిక్ అధికారుల సూచనలకు పాటించని వారికి రూ.2వేలు ఫైన్ చెల్లించాల్సిందే.

ఈ వాహనం లైసెన్స్ ఇంట్లో మర్చిపోయి మీరు వెహికిల్ తో రోడ్డు మీదకు వచ్చారంటే... రూ.5వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  లెసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నారనే కేసు కింద మీకు ఈ జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ కాపీ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే... రూ.1000 నుంచి రూ.2వేల వరకు ఫైన్ కట్టాల్సి వస్తుంది. కారులో వెళ్తూ సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ.వెయ్యి చెల్లించాల్సి రావొచ్చు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. 

డ్రైవింగ్ లైసెన్సింగ్ షరతులను ఉల్లంఘించినందుకు రైడ్-హెయిలింగ్ అగ్రిగేటర్లకు రూ .1 లక్ష వరకు, వాహనాలను ఓవర్‌లోడ్ చేసినందుకు రూ .20,000 వరకు జరిమానా విధించవచ్చు. ర్యాష్ డ్రైవింగ్ కి రూ.వెయ్యి నుంచి రూ.5వేలకు వరకు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇక మద్యం సేవించి పట్టుపడితే మాత్రం రూ.పది వేల వరకు చెల్లించాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios