హైదరాబాద్: పోలీసుల ఎన్‌కౌంటర్ లో మరణించిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు  చెందిన రూ. 150 కోట్ల విలువైన ఆస్తులపై ఈడీతో దర్యాప్తు జరిపించాలని సిట్ సూచించింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది మంది పోలీసులను  హతమార్చిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన  విషయం తెలిసిందే.ఈ ఏడాది జూలై మాసంలో వికాస్ దూబే ఎన్ కౌంటర్ లో మరణించాడు. ఈ ఘటనపై  రాష్ట్ర ప్రభుత్వం  ముగ్గురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది.

also read:నా భర్తను నేనే కాల్చి చంపేదానిని: వికాస్ దూబే భార్య రిచా

ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి 3100  నివేదిక ను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికలో పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.
గ్యాంగ్‌స్టర్ కు సహకరించిన పోలీస్, రెవిన్యూ, గ్రామీణాభివృద్ధిశాఖలకు చెందిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ సిఫారసు చేసింది.

దూబే పై వచ్చిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు. నకిలీ ధృవపత్రాలతో ఆయుధాలు, సిమ్ కార్డులు, పాస్ పోర్టులను సమకూర్చినట్టుగా సిట్ తన నివేదికలో పేర్కొంది. దూబేకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.వికాస్ దూబే అక్రమాస్తులపై ఈడీతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని సిట్ సూచించింది.  వికాస్ దూబేపై 60కిపైగా కేసులున్నాయి.