అలాంటిది వారు ఏకంగా  చీరలు కట్టుకొని.. కాళ్లకు స్నీకర్స్ ధరించి అదరగొట్టేశారు.

ఈ రోజుల్లో అమ్మాయిలు చీర కట్టుకొని సరిగా నడవడం కూడా రాక ఇబ్బందిపడుతున్నారు. అలాంటిది మహిళలంతా కలిసి చీరలు కట్టుకొని ఏకంగా ఫుట్ బాల్ ఆడేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా మహిళలు ఫుట్ బాల్ ఆడటమే చాలా తక్కువగా చూస్తుంటాం. అలాంటిది వారు ఏకంగా చీరలు కట్టుకొని.. కాళ్లకు స్నీకర్స్ ధరించి అదరగొట్టేశారు. ఈ సంఘటన గ్వాలియర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గ్వాలియర్ లో కొందరు మహిళలు ఫుట్ బాల్ ఆడారు. వీడియో చిన్నదే అయినప్పటికీ.. వారు ఆట ఆడిన తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. అదరగొట్టేశారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోలో కనిపించే మహిళలంతా 25 నుంచి 50ఏళ్ల వయసు వారు కావడం విశేషం. ఈ వీడియో మార్చి 25వ తేదీన తీసినట్లు తెలుస్తోంది.