Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న కారు పై కూర్చున్న కుక్క: సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో రోజుకో వీడియో వెలుగు చూస్తుంది. వేగంగా వెళ్తున్న కారు టాప్ పై ఓ కుక్క  కూర్చున్న వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Video of dog on car roof goes viral lns
Author
First Published Mar 26, 2024, 7:52 AM IST

న్యూఢిల్లీ: నడుస్తున్న  కారు టాప్ పై  ఓ వీధి కుక్క  కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ విషయమై జంతు ప్రేమికులు  ఇండోర్  విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు.  కదులుతున్న కారు పై కప్పుపై  కుక్క ఉన్న వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు.

కదులుతున్న కారుపై కూర్చున్న కుక్క భయంతో కన్పించింది. అయితే  ఒకరు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో  జంతు ప్రేమికుల దృష్టికి వచ్చింది.  ఈ వీడియో ఆధారంగా  చర్యలు తీసుకోవాలని  పోలీసులకు జంతు ప్రేమికులు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది.

ఈ నెల 26న ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ నగర్, సత్యసాయి స్వ్కేర్ మధ్య  ఈ ఘటన చోటు చేసుకుందని  ఎనిమల్  యాక్టివిస్ట్  ప్రియాన్స్ జైన్  చెప్పారు.  ఈ వీడియోను చూసిన తర్వాత  విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా జైన్  తెలిపారని ఆ కథనం వివరించింది. ఈ విషయమై  విచారణ చేస్తున్నామని  విజయ్ నగర్ పోలీసులు ప్రకటించారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios