బైక్ పై రంగులు పూసుకున్న యువతులు: రూ.33 వేలు ఫైన్ వేసిన పోలీసులు
బైక్ పై వెళ్తున్న యువతుల చర్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అంతేకాదు వారికి ఫైన్ కూడ వేశారు పోలీసులు.
న్యూఢిల్లీ: బైక్ పై వెళ్తూ ఇద్దరు యువతులు రంగులు పూసుకుంటున్న వీడియో ఓకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ వీడియోలో యువతులు వ్యవహరించిన తీరుపై చర్చ సాగుతుంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో స్కూటీని ఓ వ్యక్తి నడుపుతుండగా ఇద్దరు యువతులు స్కూటీ వెనుక వైపు ఎదురెదురుగా కూర్చున్నారు. హోలీని పురస్కరించుకొని యువతులు రంగులు పూసుకున్నారు. గోలియోన్ కి రాస్లిలా రామ్ లీలా చిత్రంలోని అంగ్ లగా దే పాటకు అనుగుణంగా యువతులు రంగులు పూసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు వీరికి రూ.33 వేల జరిమానాను విధించారు.
ఈ విషయమై ఈ చలాన్ జారీ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా పోలీసులు ప్రకటించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి బైక్ పై రంగులు పూసుకుంటున్న యువతులకు జరిమానా విధించిన పోలీసులకు పలువురు నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోలోని వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు కోరారు.
మూడు రోజుల క్రితం ఢిల్లీ మెట్రో రైలులో కూడ ఇద్దరు యువతులు ఇదే తరహాలో రంగులు పూసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేశారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. ఈ విషయమై ఢిల్లీ మెట్రో రైలు అధికారులు స్పందించారు.