జీతం విషయంలో తలెత్తిన చిన్న గొడవ కారణంగా... ఓ మహిళను జట్టుపట్టుకొని బయటకు ఈడ్చేశారు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని యూనిసెక్స్ సెలూన్ లో చోటుచేసుకుంది.
జీతం విషయంలో తలెత్తిన చిన్న గొడవ కారణంగా... ఓ మహిళను జట్టుపట్టుకొని బయటకు ఈడ్చేశారు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని యూనిసెక్స్ సెలూన్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగాల్ కి చెందిన 25ఏళ్ల యువతి.. నోయిడాలోని వీనస్ యూనిసెక్స్ సెలూన్ లో మార్చి 16వ తేదీన మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యింది. నెలకు రూ.17వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. నెల గడవడంతో జీతం ఇవ్వమని యువతి యజమానిని కోరింది. అందుకు అతను తన కోరిక తీరిస్తేనే జీతం ఇస్తానని చెప్పారు.
అతని కోరికను యువతి నిరాకరించింది. దీంతో... అతను ఆమెను అతికిరాతకంగా హింసించాడు. తన స్నేహితులతో కలిసి యువతి జుట్టుపట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. దీనిని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. బాధితురాలు సెలూన్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా... నిందితుడు కూడా యువతిపై రివర్స్ లో కేసు పెట్టడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.