ఎర్రచందనం స్మగర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్‌ను మృతి చెందాడు. ఈ నెల 1వ తేదీన జైలులో ఆయనకు గుండె పోటు వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను సేలం ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స కోసం తరలించారు. తాజాగా, ఆయన పరిస్థితి విషమించి మరణించాడు.
చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వీరప్పనే. నల్లమల అడవుల్లో కొన్ని సంవత్సరాలు ఆయన అంధకారంలోనే ఏలాడు. ఎర్రచందనం మొద్దులను స్మగ్లింగ్ చేశాడు. పోలీసులు, నిఘా విభాగాలు ఏళ్ల తరబడి ఆయనపై నిఘా పెట్టాయి. పట్టుకోవడానికి ప్రయత్నించాయి. చివరకు అనారోగ్యంతో ఉన్న వీరప్పన్‌ను అండర్ కవర్‌లో ఉన్న పోలీసులు అంబులెన్స్ ఎక్కించి ట్రాప్ చేశారు. 2004లో ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా, వీరప్పన్ పెద్దన్న గుండెపోటుతో మరణించాడు.
ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న 75 ఏళ్ల మత్తయ్యన్ తమిళనాడులోని సేలం ప్రభుత్వ హాస్పిటల్‌లో మరణించాడు. మత్తయ్యన్ ఓ హత్య కేసులో సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్ష పొందుతున్నాడు. మే 1న ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో పోలీసులు ఆయనను కుమారమంగళం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి మే 25వ తేదీ ఉదయం మరణించాడు.
1987లో ఫారెస్ట్ రేంజ్ చిదంబరం హత్య జరిగింది. ఈ హత్య కేసులో పోలీసులు మత్తయ్యన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులోనే వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్‌కు జీవిత ఖైదు పడింది. ఈ కేసులో ఆమె 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. మత్తయ్యన్‌నూ విడుదల చేయాలని పలువురు పిటిషన్లు కూడా దాఖలు కావడం గమనార్హం.
చిన్నప్పటి నుంచి తాను తన తండ్రిని చూడలేదని, కేవలం ఆయన చనిపోయాక మృతదేహాన్ని మాత్రమే కాసేపు చూశానన్నారు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి.
తన జీవితంలో చేదు అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని విద్య ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తనను శత్రువుగానో, ప్రత్యర్థిగానో చూడలేదని... మంచితనంతో ఆదరించిన వాళ్లు ఎందరో ఉన్నారని, ఇదే భాగ్యంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తన చదువు, చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుల భోదనలు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని విద్యారాణి చెప్పారు. తన తండ్రిని చూడనప్పటికీ.. ఆయన గురించి కొందరు మంచితనంతో ఎన్నో మాటలు చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.
జీవచ్ఛవంగా ఉన్న తన తండ్రిని ఏదో ఆందోళన, ఉరుకులు పరుగులుగా చూసినట్లు విద్య ఉద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేస్తానని, దేశంలో జాతీయ పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
