యువకుడికి మత్తు మందు ఇచ్చి మరీ అతని పురుషాంగాన్ని... ముగ్గురు హిజ్రాలు కోసేశారు. అనంతరం అతనిని చీకటి గదిలో  పడేశారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాహజన్ పూర్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సత్రవలి గ్రామానికి చెందిన యువకుడు(22) ఓ పెళ్లిలో బ్యాండ్ మేళం ట్రూప్ లో పనిచేస్తున్నాడు. కాగా... మే 8వ తేదీన ఆ యువకుడు ఓ పెళ్లి కోసం తన ట్రూప్ తో కలిసి వెళ్లాడు. అక్కడ అతనికి ముగ్గురు హిజ్రాలు పరిచయం అయ్యారు. అతనితో మాట కలిపి స్నేహం చేసుకున్నారు. అనంతరం అతనికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చి... అతని చేత తాగించారు.

మత్తు రావడంతో యువకుడు అక్కడే పడిపోయాడు. అతనిని ఈ ముగ్గురు హిజ్రాలు... ఓ చీకటి గదిలోకి తీసుకువెళ్లి పురుషాంగం కోసేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా..అతనికి స్పృహ వచ్చేసరికి తన పురుషాంగం తెగి పడి ఉండటాన్ని గమనించాడు. తీవ్రమైన నొప్పి రావడంతో ముందుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని, ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కాగా, బాధితుడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని, అతడి పరిస్థితి ఆందోళనకరమేమీ కాదని చెప్పారు. మరికొన్ని టెస్ట్‌లు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపినట్లు బాధితుడి సోదరుడు తెలిపాడు.