Asianet News TeluguAsianet News Telugu

దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి: వారణాసిలో రూ. 600 కోట్ల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన

దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. పండుగల సీజన్ లో దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాల్సిందిగా ఆయన కోరారు.

Use local products to boost economy: PM Modi makes local for Diwali pitch to nation from Varanasi lns
Author
Varanasi, First Published Nov 9, 2020, 7:42 PM IST

వారణాసి: దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. పండుగల సీజన్ లో దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాల్సిందిగా ఆయన కోరారు.

సోమవారం నాడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు వీడియో కాన్పరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.

దీపావళి పండుగకు దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలను ఆయన కోరారు. స్థానికంగా తయారైన మట్టి దీపాలను మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. స్థానిక ఉత్పత్తులకు చేయూతనివ్వడం అని మోడీ తెలిపారు.

దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడి తయారీదారుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. దేశ ఆర్ధికాభివృద్ధిలో వారిని కూడ ప్రోత్సహించినట్టు అవుతోందని మోడీ చెప్పారు.

స్థానిక ఉత్పత్తులతో దీపావళి పండుగను జరుపుకోవడం దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు.దీపావళి, గోవర్ధన్ పూజ లపై మోడీ శుభాకాంక్షలు తెలిపారు మోడీ. దీపావళికి స్థానిక వస్తువులను గర్వంగా ప్రచారం చేయమని ప్రజలను కోరారు. 

గత నెలలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడ  స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరిన విషయం తెలిసిందే.ఇవాళ సారనాథ్ లైట్ సౌండ్ షో, లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి రామ్ నగర్ ఆసుపత్రి అప్ గ్రేడ్, మురుగునీటి పనులు, ఆవుల రక్షణ మౌళిక సదుపాయాల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios