Asianet News TeluguAsianet News Telugu

బుర్ఖా వేసుకుందని డాక్టర్ పై విదేశీ మహిళ దాడి

అమెరికాకు చెందిన 43ఏళ్ల మహిళ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. దానికే ఆమె చికిత్స తీసుకుంటోంది. కాగా... తాజాగా ఆమె ముస్లిం మహిళా వైద్యురాలిపై దాడికి పాల్పడింది. డాక్టర్ ని విపరీతంగా దూషించడంతోపాటు.. దాడిచేసి గాయపరిచింది. ఈ ఘటన ఓ షాపింగ్ మాల్ లో చోటుచేసుకోవడం గమనార్హం.

US Woman Abuses, Assaults Pune Doctor Wearing Burqa; Charged: Police
Author
Hyderabad, First Published Sep 3, 2019, 11:40 AM IST

బుర్ఖా వేసుకుందనే కారణంతో ఓ మహిళా వైద్యురాలిపై ఓ విదేశీ మహిళ దాడి చేసింది. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో చోటేసుకుంది. కాగా... ఆ విదేశీ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పూర్తివివరాల్లోకి వెళితే... అమెరికాకు చెందిన 43ఏళ్ల మహిళ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. దానికే ఆమె చికిత్స తీసుకుంటోంది. కాగా... తాజాగా ఆమె ముస్లిం మహిళా వైద్యురాలిపై దాడికి పాల్పడింది. డాక్టర్ ని విపరీతంగా దూషించడంతోపాటు.. దాడిచేసి గాయపరిచింది. ఈ ఘటన ఓ షాపింగ్ మాల్ లో చోటుచేసుకోవడం గమనార్హం.

ఇరువుు పూణేలోని కంటన్మెంట్ ప్రాంతంలో షాపింగ్ కి వెళ్లారు. అక్కడ విదేశీ మహిళ... డాక్టర్ ని ముస్లింగా గుర్తించింది. ఆమె బుర్ఖా వేసి ఉండటాన్ని గమనించి దూషించడం మొదలుపెట్టింది. అనంతరం దాడికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని పోలీసులు అమెరికా రాయబార కార్యాలయానికి తెలియజేశారు. ఆ మహిళ పోలీసులను కూడా ధూషించడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios