తన భార్య, ఐదేళ్ల చిన్నారికి గత మూడు-నాలుగేళ్లుగా ఆరోగ్యం బాగోలేదని అది తట్టుకోలేక, గుళ్లోని విగ్రహాలను ధ్వంసం చేశానని పోలీసులు విచారణలో తెలిపాడో వ్యక్తి.
నోయిడా : గత కొన్నేళ్లుగా తన family ఆరోగ్యం బాగోలేదని.. ఎన్ని పూజలు చేసినా, దేవుడిని ఎంతగా మొక్కినా god కరుణించలేదట.. దీంతో దేవుడిపై మనస్తాపానికి గురై templeలోని విగ్రహాలను ధ్వంసం చేశాడో వ్యక్తి. అతడిని 27 ఏళ్ల రోజువారీ కూలీగా గుర్తించారు. అతడిని గ్రేటర్ నోయిడాలో అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ భూరాగా అతడిని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన ఒక రోజు తర్వాత విషయం గమనించిన స్థానికుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును తీసుకున్న బీటా 2 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఓ ఆలయంలోని మూడు విగ్రహాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. ఈ ఆలయానికి పూజారులు లేరని తెలిసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నివారణ చర్యగా ఘటనా స్థలంలో మోహరించారు.
"ఈ విషయంపై దర్యాప్తు చేసి నిందితుడు వినోద్ కుమార్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అతను విగ్రహాలను పాడు చేసేందుకు ఉపయోగించిన పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు.
"గత మూడు-నాలుగేళ్లుగా తన భార్య, ఐదేళ్ల చిన్నారి ఆరోగ్యం బాగోలేదని.. దేవుళ్లను ప్రార్థిస్తున్నా.. ఫలితం ఉండడం లేదని.. వారి ఆరోగ్యం బాగోలేదని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇటీవలే అతని అత్త కూడా మరణించింది. ఇది అతన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది" అని ప్రతినిధి చెప్పారు.
ఈ సంఘటనలన్నీ కుమార్ విగ్రహాలను ధ్వంసం చేయడానికి దారితీశాయని, నిందితుడు సుత్తి, ఉలిని ఉపయోగించి నేరం చేసినట్లు అంగీకరించాడని, ఆయుధాలు రెండూ స్వాధీనం చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295 (ప్రార్ధనా స్థలాన్ని అపవిత్రం చేయడం) కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా goaలో అసాధారణ రీతిలో జరిగిన చోరి ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాటిక్ గా జరిగిన ఈ దొంగతనం చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేని సమయం చూసి Bangla తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు రూ. 20 లక్షల విలువచేసే ఆభరణాలతో పాటు కొంత నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఓ Messageని రాసిపెట్టి వెళ్లారు. ఇప్పుడు అదే viralగా మారింది. ఈ ఘటన దక్షిణ గోవాలోని మార్గోవ్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆసిబ్ జెక్ అనే వ్యక్తి రెండు రోజులు హాలిడే కోసం బయటకు వెళ్లి మంగళవారం వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూసే సరికి 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆవరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అంతేకాకుండా.. ఇంట్లో టీవీ స్క్రీన్ పై ‘ఐ లవ్ యు’ అని మార్కర్ తో రాసి ఉంది. మొదట అది ఏంటో అనుకున్నాడు. ఆ తరువాత కానీ అర్థం కాలేదు. అది గమనించిన ఇంటి యజమాని ఒక్కసారిగా కంగు తిన్నాడు. వెంటనే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సచిన్ నర్వేకర్ తెలిపారు.
