Asianet News TeluguAsianet News Telugu

పొరుగింటి యువకుడిని మధ్యాహ్నం పూట ఇంటిలోకి పిలిచింది.. అతడి జననాంగాలను కట్ చేసిన వివాహిత

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ పొరుగింటిలో ఉండే యువకుడిని కొంచెం పని ఉన్నదని ఇంటిలోకి పిలిచింది. వారికి గొడవ జరిగింది. అనంతరం, ఆ యువకుడి జననాంగాలను కట్ చేసింది. ఆమె భర్త యూఏఈలో ఉంటున్నాడు.
 

UP woman calls neighbour youth to her home, cut off his genitals after a clash kms
Author
First Published Nov 18, 2023, 7:58 PM IST | Last Updated Nov 18, 2023, 7:58 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత పొరిగింటిలోనే ఉండే యువకుడిని ఇంటిలోకి పిలిచింది. ఆ తర్వాత అతడి జననాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న ఆ యువకుడిని అతడి తండ్రి చూసి వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. ఈ ఘటన లక్నోలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ఇంటిలో కొంచెం పని ఉన్నదని పొరుగింటి యువకుడిని ఆ వివాహిత రమ్మని పిలిచింది. ఆ యువకుడు వెళ్లాడు. ఆ తర్వాత కొంతసేపటికి వారిద్దరికి గొడవ జరిగింది. అనంతరం, అతడి జననాంగాలను ఆమె కట్ చేసింది. 

కొడుకు అపస్మారక స్థితిలో పొరుగింటిలో పడి ఉండటాన్ని తండ్రి చూశాడు. వెంటనే కౌశంబి జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించాడు. ఆ యువకుడు ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. అనంతరం, ట్రీట్‌మెంట్ కోసం అతడిని ప్రయాగ్ రాజ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. 

Also Read: Israel War: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కాల్చి పారేయాలి: కాంగ్రెస్ ఎంపీ షాకింగ్ కామెంట్లు

పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త యూఏఈలో ఉంటున్నాడు. ఆ యువకుడి పై దాడి చేయడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాంఝాపూర్ పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద ఆమె పై కేసు నమోదైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios