Asianet News TeluguAsianet News Telugu

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 : వరల్డ్ క్లాస్ ఏర్పాట్లతో అదరగొడుతున్న యోగి సర్కార్

ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2024లో  72 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా యోగి సర్కార్ వారికి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రత్యేక వెబ్‌సైట్, యాప్ ద్వారా సందర్శకులకు అన్ని సమాచారాలు అందుబాటులో ఉంటాయి. 

UP International Trade Show 2024: Yogi Government to offer world class facilities AKP
Author
First Published Sep 24, 2024, 11:59 PM IST | Last Updated Sep 24, 2024, 11:59 PM IST

లక్నో : ఉత్తరప్రదేశ్‌ను పారిశ్రామికంగా అగ్రగామిగా తీర్చిదిద్దే విజన్ తో యోగి సర్కార్ మరో అడుగు ముందుకేసింది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2024 (యూపీఐటీఎస్) కు వచ్చే ప్రతినిధులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ మెగా ట్రేడ్ షోలో 72 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు... కొనుగోలుదారులు, కళాకారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రెసిడెంట్లు హాజరవుతున్నారు. వీరందరికీ ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించేందుకు యోగి సర్కార్ ఏర్పాట్లు చేసింది.

సమాచారం అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్, యాప్

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో వెబ్‌సైట్ ద్వారా సందర్శకులు లాగిన్ అయి డిజిటల్ యాక్సెస్ పొందవచ్చు. యూపీఐటీఎస్ 2024 కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఈవెంట్స్, బ్రోచర్, ఫెయిర్ డైరెక్టరీ, ఫెయిర్ సౌకర్యాలు, షటిల్ సర్వీస్, వేదికతో పాటు ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. పేమెంట్ గేట్‌వే, హోటల్ బుకింగ్ వంటి సేవలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేసిన మూడు ఉచిత షటిల్ సర్వీసుల రూట్ల వివరాలు కూడా ఈ యాప్‌లో చూసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఆధారంగా డిజిటల్ ఎంట్రీ, పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించారు.

వీవీఐపీ లాంజ్, ఇతర కార్యక్రమాలు

ఈ మెగా ట్రేడ్ షోలో పాల్గొనేందుకు వచ్చే ప్రతినిధుల కోసం అన్ని హంగులతో కూడిన ప్రత్యేక వీవీఐపీ లాంజ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక రుచులతో పాటు అంతర్జాతీయ వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. బీ2బీ, బీ2సీ సమావేశాలు జరుగుతాయి. వీటి షెడ్యూల్ వివరాలు యాప్‌లో తెలుసుకోవచ్చు.

లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఒడిఓపీ, గ్రామీణ పరిశ్రమలు, ఖాదీ, చేనేత, సంప్రదాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది. సెప్టెంబర్ 27న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఖాదీ ఫ్యాషన్ షో నిర్వహించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios