యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 : స్పెషల్ లేజర్ షో టైమింగ్స్ ఇవే... మిస్ కాకండి
యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024లో అద్భుతమైన లేజర్ షో నిర్వహించనున్నారు. ఈ షో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు హాల్ నంబర్ 14, 15 ఎదురుగా ఉన్న ఓపెన్ ఏరియాలో జరుగుతుంది.
లక్నో : యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024లో భాగంగా నిర్వహించనున్న లేజర్ షో కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లేజర్ షో నోయిడాలో ట్రేడ్ షో జరుగుతున్న ఇండియా ఎక్స్‌పో మార్ట్ హాల్ నంబర్ 14,15 ఎదురుగా గల ఖాళీ స్థలంలో వుంటుంది. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో అంటే రెండు రోజులూ సాయంత్రం 7 గంటలకు ఈ లేజర్ షో వుంటుంది.
ఈ లేజర్ షో ద్వారా ఉత్తరప్రదేశ్ యొక్క గొప్ప చరిత్ర, అభివృద్ధి మైలురాళ్లను ప్రదర్శించనున్నారు. లైట్ ఆండ్ సౌండ్ తో కూడిన లేజర్ ప్రొజెక్షన్ ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో కీలక ఘట్టాలను ప్రత్యక్షంగా చూపించనున్నారు. ప్రాచీన కాలం నుండి వాణిజ్యం, పరిశ్రమలలో రాష్ట్రం సాధించిన విజయాలను ఈ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఈ షో ద్వారా ప్రేక్షకులు అద్భుతమైన అభివృద్ధి ప్రయాణాన్ని చూడగలరు. ఉత్తరప్రదేశ్ తన ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వంతో కూడిన వాణిజ్యంతో ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకుంటారు.
ఈ లేజర్ షోలో రాష్ట్రం యొక్క గొప్ప గతాన్ని కూడా ప్రదర్శిస్తారు. భారతీయ నాగరికత, కళలు, సంస్కృతికి ఉత్తరప్రదేశ్ చేసిన అద్భుతమైన సహకారాన్ని ఇందులో చూపిస్తారు. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP) వంటి జాతీయ ఆర్థిక కార్యక్రమాలలో ఉత్తరప్రదేశ్ ఎలా ముందంజలో ఉందో చూపిస్తూ దాని వర్తమానం, భవిష్యత్తును కూడా ఈ షో ద్వారా వివరిస్తారు.
అత్యాధునిక విజువల్స్, అద్భుతమైన కథనంతో కూడిన ఈ లేజర్ షో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024లో తప్పకుండా చూడాల్సిన వాటిలో ఒకటి. ఇది కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్ యొక్క అపారమైన అవకాశాల గురించి కూడా సందర్శకులకు తెలియజేస్తుంది. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది, సందర్శకులందరికి గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది.