యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 : టైమింగ్స్ ఇవే

గ్రేటర్ నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో రెండవ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ మెగా షోలో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, అలాగే వియత్నాం రుచులు సందర్శకులను ఆకర్షిస్తాయి.

UP International Trade Show 2024: Exploring Uttar Pradesh's Crafts, Cuisine, and Culture AKP

లక్నో : యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (UPITS) రెండవ ఎడిషన్ బుధవారం గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ప్రారంభం కానుంది.  ఉదయం 12 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈ మెగా షోను ప్రారంభించనున్నారు. రెండవ ఎడిషన్ మొదటి దాని కంటే పెద్దదిగా ఉండనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ద్వారా  యూపీలోని చేతిపనులు, వంటకాలు,  సంస్కృతిని యావత్ ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా యూపీలోని వివిధ ప్రాంతాలలో తయారు చేయబడిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, అలాగే భారతదేశం, వియత్నాం రుచులు సందర్శకులను ఆకర్షిస్తాయి. అదే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా   రాష్ట్ర సంస్కృతి గురించి కూడా ప్రజలకు తెలియజేస్తారు. సెప్టెంబరు 29న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.

మూడున్నర లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం

ఎంఎస్ఎంఈ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాకేష్ సచాన్ మాట్లాడుతూ... యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో నేడు ప్రపంచ పటంలో బ్రాండ్ యూపీగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 2500 స్టాల్స్, ఎగ్జిబిషన్‌ల ద్వారా దేశ విదేశాలకు ఉత్తరప్రదేశ్ ప్రతిభను ప్రదర్శింపబడుతుందని అన్నారు. ఇప్పటి వరకు 70 దేశాల నుండి 350 మందికి పైగా కొనుగోలుదారులుఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు నమోదు చేసుకున్నారు.. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి 3,50,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని... ఇది గత సంవత్సరం కంటే ఎక్కువని మంత్రి అన్నారు.

ఫ్యాషన్ షో కూడా ఉంటుంది

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సహకారంతో వియత్నాం, బొలీవియా, రష్యా, వెనిజులా, ఈజిప్ట్, కజకిస్తాన్‌లకు చెందిన సాంస్కృతిక బృందాలతో కార్యక్రమాలను నిర్వహిస్తాయని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ సాంప్రదాయ వాతావరణం,  దుస్తులను ప్రపంచానికి ఫ్యాషన్ షో ద్వారా పరిచయం చేయనున్నారు. ఈ  ఫ్యాషన్ షోకు కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ కిషోర్ హాజరవుతారు. ప్రారంభోత్సవంలో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ రాణే, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నందగోపాల్ నంది పాల్గొంటారు.

నూతన ఉత్పత్తుల ప్రదర్శన

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024లో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ విభాగాలు తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో తయారవుతున్న వస్తువులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నవారుకూడా  ఈ ప్రదర్శన ద్వారా తమ సామర్థ్యాన్ని చాటుకోనున్నారు రక్షణ తయారీ రంగంలో ఉత్తరప్రదేశ్ సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రదర్శిస్తున్నారు. స్టార్టప్‌లు, ఇ-కామర్స్, ఎగుమతులు మొదలైన వాటిపై సాంకేతిక సెషన్‌లు కూడా నిర్వహించబడుతున్నాయి, దీని ద్వారా వ్యవస్థాపకులు, యువతకు కొత్త దిశ, దృక్పథం లభిస్తుంది.

ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు

ఈ కార్యక్రమంలో సమావేశాలు, ఉత్పత్తి ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు, లేజర్ షోలు వంటి అనేక ఆకర్షణీయమైన కార్యకలాపాలు ఉంటాయి. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలైన బ్రజ్, అవధ్, రోహిల్‌ఖండ్, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, పశ్చిమ యూపీల సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారరు శివతాండవం, కథక్ నృత్య నాటికలు వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు.

అంకిత్ తివారీ, కనికా కపూర్, పలాష్ సేన్ యొక్క యుఫోరియా బ్యాండ్ వంటి ప్రముఖ కళాకారులు తమ సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారు. అంతేకాకుండా  ఈ ఏడాది భాగస్వామ్య దేశమైన వియత్నాం నుండి అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. అలాగే ICCR (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) సహకారంతో బొలీవియా, రష్యా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, బ్రెజిల్, వెనిజులా, ఈజిప్ట్‌లకు చెందిన కళాకారులు కూడా ప్రదర్శనలు ఇస్తారు.

సాయంత్రం 3 నుండి రాత్రి 10 గంటల వరకు సాధారణ సందర్శకుల కోసం ప్రదర్శన 

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాపార సమయాలు ఉంటాయి, సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాధారణ ప్రజల కోసం ప్రదర్శన తెరిచి ఉంటుంది. దీనిలో ప్రజలు రాష్ట్రంలోని చేతితో తయారు చేసిన వస్తువులతో పాటు  వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‌లను చూడవచ్చు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios