గర్భిణి మహిళలకు యోగి సర్కార్ కానుక ...డబ్బులు లేకుండానే అల్ట్రాసౌండ్
ఉత్తరప్రదేశ్ కు చెందిన పేద గర్భిణి మహిళలకు యోగి సర్కార్ ఉచిత అల్ట్రాసౌండ్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే 6 లక్షలకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 1800కు పైగా ప్రైవేట్ కేంద్రాల్లో ఈ సేవ అందుబాటులో ఉంది.
లక్నో : యూపీ ప్రజలకు చాాలా సులభంగా, చవకగా, నాణ్యమైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరంతరం కృషి చేస్తున్నారు. గత ఏడున్నర సంవత్సరాల్లో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దీని ఫలితంగా ఒకప్పుడు 'అనారోగ్య రాష్ట్రం' అని పిలవబడిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 'ఆరోగ్య ప్రదేశ్'గా నిలిచింది.
యోగి సర్కార్ గర్భిణులకు ప్రైవేట్ అల్ట్రాసౌండ్ కేంద్రాల్లో ఉచిత అల్ట్రాసౌండ్ సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పటికే 6 లక్షలకు పైగా గర్భిణులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఏ జిల్లాలోనైనా గర్భిణులు ఇబ్బంది లేకుండా ఉచిత అల్ట్రాసౌండ్ సేవ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
1,861 ప్రైవేట్ కేంద్రాల్లో ఉచిత అల్ట్రాసౌండ్
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) డైరెక్టర్ డాక్టర్ పింకీ జోవెల్ మాట్లాడుతూ... తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. అందుకే నాణ్యమైన వైద్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద ఫిబ్రవరి 2023 నుంచి గర్భిణులకు ఉచిత అల్ట్రాసౌండ్ కోసం ఈ-రూపీ వోచర్లు అందిస్తున్నట్లు తెలిపారు. 75 జిల్లాల్లోని 1,861 ప్రైవేట్ అల్ట్రాసౌండ్ కేంద్రాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఇప్పటివరకు 14,50,238 ఈ-రూపీ వోచర్లు జారీ చేయగా, 6,81,341 వోచర్లను గర్భిణులు వినియోగించుకున్నారు. ఒక నెల వరకు ఈ వోచర్లు చెల్లుతాయి. గడువులోపు వోచర్ వాడుకోకపోతే మళ్ళీ కొత్త వోచర్ పొందవచ్చు.
జిల్లా మహిళా ఆసుపత్రి, సమిష్టి ఆసుపత్రి, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో ప్రతి నెల 1, 9, 16, 24 తేదీల్లో ఈ-రూపీ వోచర్లు జారీ చేస్తున్నట్లు డాక్టర్ పింకీ జోవెల్ తెలిపారు. ఈ పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం యోగి ఆదేశించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఈ పథకం గురించి వివరిస్తున్నారు.