అన్నదాతలకు యోగి సర్కార్ గుడ్ న్యూస్ : భారీగా నిధులు మంజూరు

యోగి సర్కార్ రైతుల కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు పంటల బీమా పథకం ద్వారా రైతులకు భద్రత కల్పించి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాయి.

UP Govt Approves Substantial Funds for Pradhan Mantri Fasal Bima Yojana AKP

లక్నో : యోగి సర్కార్ వ్యవసాయ రంగానికి, రైతులకు అండగా నిలుస్తోంది...  ఇందులో భాగంగానే ఒక బిలియన్ ఆరు కోట్ల 19 లక్షల రూపాయలను నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ (ప్రధానమంత్రి పంటల బీమా పథకం) కోసం మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25) ఈ నిధులు అందించబడింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నదాతల అభ్యున్నతికి కట్టుబడి ఉందని యోగి సర్కార్ మరోసారి నిరూపించింది.  .

ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహి మాట్లాడుతూ... ప్రధానమంత్రి పంటల బీమా పథకం లక్ష్యం వ్యవసాయంలో స్థిరమైన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్నారని అన్నారు. అయితే రైతులకు ఏదయినా ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగినప్పుడు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పంటల భీమా పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.

అంతేకాదు రైతుల ఆదాయాన్ని స్థిరీకరించడం, తద్వారా వారు వ్యవసాయంలో కొనసాగేలా చేయడం,  నూతన, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడానికి కూడా ప్రధానమంత్రి పంటల భీమా పథకం ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగానికి రుణ ప్రవాహాన్ని నిర్ధారించడం, తద్వారా ఆహార భద్రత, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ రంగం వృద్ధి, పోటీతత్వాన్ని పెంచడంతో పాటు రైతులను ఉత్పత్తి ప్రమాదాల నుండి రక్షించడంలో కూడాఈ పంటల భీమా ఎంతగానో సహాయపడుతుందని మంత్రి సూర్యప్రతాప్ తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios