Asianet News TeluguAsianet News Telugu

up elections 2022 : యూపీలో కొత్త పొత్తులు.. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో జట్టు కట్టిన బీజేపీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌ను దక్కించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో అప్నాదళ్ (Apna Dal) , నిషాద్ పార్టీలతో (Nishad Party) కలిసి మొత్తం 403 స్థానాల్లో కలిసి పోటి చేస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు.

up elections 2022 BJP to contest elections in alliance with Apna Dal and Nishad Party
Author
Lucknow, First Published Jan 19, 2022, 6:53 PM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌ను దక్కించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో అప్నాదళ్ (Apna Dal) , నిషాద్ పార్టీలతో (Nishad Party) కలిసి మొత్తం 403 స్థానాల్లో కలిసి పోటి చేస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులతో నిర్వహించిన సీఈసీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల మేరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఇంటింటీ ప్రచారంపై ఫోకస్ పెట్టింది. హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ అగ్రనేతలు జనవరి మూడో వారం నుంచి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (up assembly elections) ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27 మరియు మార్చి 3 మరియు 7 తేదీల్లో యూపీలో పోలింగ్ జరగనుంది.

ఇక బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల విషయానికి వస్తే... ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఉన్నారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, సంజీవ్ బల్యాన్, రాధా మోహన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల (up elections) వేళ.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ (akhilesh yadav) దగ్గరి బంధువు అపర్ణా యాదవ్ (aparna yadav) బీజేపీలో చేరడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై అఖిలేశ్ స్పందించారు. ఆమె తమ సిద్ధాంతాలను బీజేపీకి తీసుకెళ్తారని ఆయన ఆకాంక్షించారు. అపర్ణను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తాము టిక్కెట్లు ఇవ్వలేని వారికి కూడా టిక్కెట్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలంటూ అఖిలేశ్ సెటైర్లు వేశారు. 

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (mulayam singh yadav) చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్యే అపర్ణా యాదవ్. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రీటా బహుగుణ చేతిలో ఓటమి పాలైంది. అయితే సమాజ్‌వాదీ పార్టీని వీడేముందు ఆమె తన తండ్రి ములాయంతో మాట్లాడేందుకు ప్రయత్నించారని అఖిలేశ్ తెలిపారు. అపర్ణా యాదవ్‌ను బుజ్జగించేందుకు ములాయం శాయశక్తులా ప్రయత్నించారని.. అయితే టికెట్లు తమ అంతర్గత సర్వేలపై ఆధారపడి వుంటాయని అఖిలేశ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించినందునే అపర్ణా యాదవ్ సమాజ్‌వాదీ పార్టీని వీడారని ఆయన అన్నారు. గత వారం అఖిలేశ్ యాదవ్ పార్టీలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు సహా పలువురు కీలక నేతలు చేరడంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన బీజేపీకి.. అపర్ణా యాదవ్ రాక పెద్ద ఊరట. 

Follow Us:
Download App:
  • android
  • ios