up election news 2022 : యూపీ (uttar pradesh)లో నేడు నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరో మూడు దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 10 తరువాత ప్రకటించే ఫలితాల్లో తామే విజయం సాధిస్తామని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
up election news 2022 : యూపీ (uttar pradesh)లో నేడు నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరో మూడు దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 10 తరువాత ప్రకటించే ఫలితాల్లో తామే విజయం సాధిస్తామని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తరువాత తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (delhi cm arvind kejriwal) భావిస్తున్నారు. బుధవారం యూపీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ మీరు ఉత్తరప్రదేశ్ లో పెద్ద హామీలు ఇచ్చారని, కానీ మీరు ఉత్తరప్రదేశ్ లో అధికారం ఏర్పాటు చేయగలుగుతారా ? అని చాలా మంది నన్ను అడిగారు ? ’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కొంత సమయం తరువాత దానికి ఆయన సమాధానం చెబుతూ ‘‘ పోటీ గట్టిగానే ఉందని, అసెంబ్లీలో హంగ్ ఏర్పడవచ్చని సర్వేలు చెబుతున్నాయి. బహుశా బీజేపీ (bjp) ని దూరంగా ఉంచడానికి మా సహాయం అవసరం కావచ్చు. అయితే మనం ఎన్ని సీట్లు గెలిచినా, ఒక వేళ ప్రభుత్వంలో చేరితే (జిత్నే భీ సీట్ హుమారీ ఆయేగీ ఔర్ అగర్ హమ్ సర్కార్ మే జాతే హై) అన్ని హామీలను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను.’’ అని ఆయన చెప్పారు.
ఢిల్లీ (delhi)లో మూడో సారి అధికారం చేపట్టిన జోష్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని చూస్తోంది. అందులో భాగంగానే ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పాల్గొంటోంది. ముఖ్యంగా పంజాబ్, గోవాపై అధికంగా దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచే తన ప్రచారాన్ని నిర్వహించింది. రాష్ట్రం అంతటా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తిరిగారు. ప్రజలు ఎలాంటి హామీలు ఆశిస్తున్నారో తెలుసుకున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party)తో ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) తో పొత్తు పెట్టుకోవాలని భావించింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో ఆప్ రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో ఆప్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఎస్పీ పొత్తపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పాటు తన నిర్ణయాన్ని వెలువరించడానికి చాలా సమయం తీసుకుంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలో నిలవాలని భావించింది. అయితే నవంబర్ 24వ తేదీన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (akhilesh yadav).. తన నివాసంలో AAP నేతలు సంజయ్ సింగ్ (sanjay singh), దిలీప్ పాండే (dilip singh)తో కలిసిన చిత్రాన్ని ట్వీట్ చేశారు. దానికి “ ఒక మార్పు కోసం మీటింగ్” అని క్యాప్షన్ పెట్టారు. కానీ డిసెంబర్ 22వ సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రణాళికను ప్రకటించారు.
