అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బుధవారం నాలుగో దశ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. చెదురుమదురు ఘటనల మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. 

up election news 2022 : యూపీ (up) లో నాలుగో దశ ఎన్నిక‌లు ముగిశాయి. అయితే చాలా త‌క్కువ‌గా ఓటింగ్ గా ఓటింగ్ శాతం న‌మోదు అయ్యింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంతో ప్ర‌య‌త్నించింది. అయినా అవేవీ ఫ‌లించ‌లేదు. క‌నీసం గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌మోదైన రికార్డును కూడా దాట‌లేక‌పోయాయి. 

బుధవారం యూపీలో తొమ్మిది జిల్లాల్లోని 59 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగో దశ ఎన్నికలు జ‌రిగాయి. అయితే సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు దాదాపు 61.65 శాతం పోలింగ్ న‌మోదైంది. యూపీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లో 62.55 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా లక్నో, ఉన్నావ్ జిల్లాలో 55 శాతం కంటే తక్కువ పోలింగ్ న‌మోదైంది. అయితే గ‌త కొంత కాలంగా వార్త‌ల్లో నిలిచిన ల‌ఖింపూర్ (Lakhimpur), పొరుగున ఉన్న పిలిభిత్‌ (Pilibhit)లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది.

యూపీ ఎన్నికల నాలుగో దశలో అవధ్‌లోని ఏడు జిల్లాలు, బుందేల్‌ఖండ్ (Bundelkhand) ప్రాంతంలోని రెండు జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) పనిచేయకపోవడం వల్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే, చాలా చోట్ల అవకతవకలు జరిగాయని సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి (Rajendra Choudhury) తెలిపిన వివరాల ప్రకారం, లక్నోలో చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. లక్డీకాపూల్‌లోని సరోజినీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో చాలా చోట్ల వెలుతురు సరిగా లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ప‌డ్డారు. 

లక్నో కాంట్ అసెంబ్లీ స్థానంలో కొన్ని చోట్ల నకిలీ ఓటింగ్ జరిగినట్లు ఎస్పీ నేతలు ఆరోపించారు. సీతాపూర్ 
, ఉన్నావ్ జిల్లాల్లో చాలా చోట్ల ఎస్పీ కార్యకర్తలు, నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని అన్నారు. సీతాపూర్ ( Sitapur) జిల్లాలో ఎస్పీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ డియోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా కుమారుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని (ajay mishra theni), లఖింపూర్ ఖేరీలో అనేక మంది పోలీసు సిబ్బంది మ‌ధ్య‌, గంద‌ర‌గోళ ప‌రిస్థితుల మ‌ధ్య త‌న ఓటు వేశారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ (congress), బీజేపీ (bjp), సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party)-రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) కూటమి, బహుజన్ సమాజ్ పార్టీ (bsp) ప్రధాన పోటీదారులుగా పోటీలో నిలిచాయి. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో మొత్తం 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. అయితే ఇందులో ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు నాలుగు ద‌శ‌ల ఎన్నిక‌లు ముగిశాయి. ఫిబ్రవరి 27వ తేదీన ఐదో ద‌శ‌, మార్చి 3వ తేదీన ఆరో ద‌శ‌, మార్చి 7వ తేదీన ఏడో ద‌శ పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న ఉంటుంది.