Asianet News TeluguAsianet News Telugu

UP Election 2022: యోగి సర్కార్‌కు వరుస షాక్‌లు.. రాజీనామా చేసిన మరో మంత్రి..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022) వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా యోగి కేబినెట్‌లోని మరో మంత్రి కూడా తన పదవికి రాజీనామా చేశారు. 
 

UP election 2022 Minister Dara Singh Chauhan quits from his post
Author
Lucknow, First Published Jan 12, 2022, 4:07 PM IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022) వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మంగళవారం రోజును కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. స్వామి ప్రసాద్ మౌర్య పార్టీని వీడిన కొద్ది గంటల్లోనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. అయితే తాజాగా యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని మరో మంత్రి కూడా తన పదవికి రాజీనామా చేశారు. 

ప్రస్తుతం యూపీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న దారా సింగ్ చౌహాన్ (Dara Singh Chauhan) ఆ పదవికి రాజీనామా చేశారు. ‘నేను అంకితభావంతో పనిచేశాను. అయితే వెనుకబడిన, అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, నిరుద్యోగ యువత పట్ల ఈ ప్రభుత్వ అణచివేత వైఖరి.. వెనుకబడిన, దళితుల కోటాను విస్మరించినందుకు బాధతో నేను రాజీనామా చేస్తున్నాను’అని దారా సింగ్ చౌహాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

UP election 2022 Minister Dara Singh Chauhan quits from his post

అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో యోగి సర్కార్‌‌కు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. నిన్న స్వామి ప్రసాద్ మౌర్యను బీజేపీని వీడిన కొద్ది గంటల్లోనే.. ఎమ్మెల్యేల రోషన్‌లాల్‌ వర్మ, బ్రిజేశ్‌ ప్రజాపతి, భగవతి ప్రసాద్ సాగర్‌ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బిదునా స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న వినయ్ షాక్యా కూడా తాను పార్టీని వీడుతున్నట్టుగా వెల్లడించారు. వీరంతా కూడా సమాజ్ వాదీ పార్టీ చేరనున్నట్టుగా తెలుస్తోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios