దంపతులు పోలీస్ స్టేషన్ లోనే  ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.   పొరిగింటి వారితో జరిగిన గొడవ కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మధుర ప్రాంతానికి చెందిన దంపతులకు తమ పొరుగింటివారితో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. తమ తప్పులేకపోయినా.. వాళ్లు తమపై దాడి చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని... ఎలాంటి చర్యలు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ దంపతులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడే ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పేందుకు యత్నించారు. అప్పటిటకే వారి శరీరాలు 60శాతానికిపైగా కాలిపోయాయి. కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తలరించారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా... ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్ లో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్, మరో ఇద్దరు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. దర్యాప్తు చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.