కన్న కొడుకుని , కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రయాగరాజ్ నగరానికి చెందిన గోవింద్ నారాయణ్ పోలీసుకానిస్టేబుల్ గా పనిచేసేవాడు. ఇతనికి భార్య చంద్ర, ఇద్దరు కుమారులున్నారు. అకస్మాత్తుగా కానిస్టేబుల్ గోవింద్ నారాయణ్ తన భార్య చంద్ర, కుమారుడు సోనును హతమార్చి, తాను సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో భాను పెద్ద కుమారుడు భాను ఇంట్లో లేకపోవడంతో అతను చావు నుంచి తప్పించుకున్నాడు. 

కానిస్టేబుల్ పెద్ద కుమారుడు భాను బయటకు వెళ్లి ఇంటికి రాగా గేటుకు లోపల నుంచి తాళం వేసి ఉంది. తాళం పగలగొట్టి ఇంట్లో చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

 గోవింద్ భార్య, కుమారుడిని హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. గోవింద్ 20 ఏళ్లుగా డీఐజీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే... తమ కుటుంబంలో ఎలాంటి మనస్పర్థలు లేవని... తన తండ్రి ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదని భాను పేర్కొన్నాడు. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.