Shiv Sena: AIMIM పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని శివసేన  చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌  ఎంఐఎంను బీజేపీ 'బి టీమ్'‌గా ఆయన పేర్కొన్నారు. శివసేన ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఉద్ధవ్ స‌మావేశ‌మ‌య్యారు. 

Shiv Sena: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తో పొత్తు ప్రసక్తే లేదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్ఫ‌ష్టం చేశారు. AIMIMను బీజేపీ 'బి టీమ్ ( BJP's 'B-team)గా ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శివసేన ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఉద్ధవ్ థాకరే ఆదివారం స‌మావేశ‌మ‌య్యారు. ముంబైలోని శివసేన భవన్‌లో జ‌రిగిన‌ సమావేశంలో సంజయ్ రౌత్, వినాయక్ రౌత్, ఏక్‌నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం మీడియాతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, బీజేపీకి 'టీమ్ బీ'గా ఉన్న ఎంఐఎం చేసిన పొత్తు ప్రతిపాదనను తమ పార్టీ ఎంతమాత్రం అంగీకరించేది లేదని తెలిపారు. శివసేనకు ఉన్న హిందుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే ఎంఐఎం ద్వారా శివసేన, మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను బీజేపీ ఉద్దేశపూర్వకంగా చేయించిందని ఆయన ఆరోపించారు.

లాలూ ఆర్జేడీలో శరద్ యాదవ్ ఎల్‌జేడీ విలీనందీనికి ముందు, ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు ఇంతియాజ్ జలీల్ మహారాష్ట్రలోని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ 'మహా కూటిమి'తో పొత్తు ప్రతిపాదన చేశారు. మహారాష్ట్ర‌లో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవ‌డానికి అధికార మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమితో తమ పార్టీ పొత్తు పెట్టుకోవచ్చని, త్రిచక్ర ఆటోరిక్షా నుంచి సదుపాయం ఉన్న కారులో ప్రయాణించవచ్చని, బీజేపీ సైతం ఎంఐఎంతో శివసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదంటూ ఎఐఎంఐఎం ఎంపి ఇంతియాజ్ జలీల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఎంపి ఇంతియాజ్ జలీల్ తాజా ప్రతిపాదనను శివసేన తోసిపుచ్చింది. బీజేపీనే స్వయంగా తమ 'టీమ్ బీ' అయిన ఎంఐఎంతో ఈ మాటలు చెప్పిస్తోందని, శివసేనకు ఉన్న హిందుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 2 సీట్లు గెలుచుకుంది. 

శివసేన AIMIM ప్రతిపాదనను తిరస్కరించడంతో.. బిజెపిని ఓడించడానికి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సిపితో పొత్తు పెట్టుకోవడానికి AIMIM సిద్ధంగా ఉందని, అయితే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని పార్టీని దూరంగా ఉంచాలని జలీల్ అన్నారు. మహారాష్ట్రలో శివసేనతో AIMIM పొత్తు అంగీకరించరని తెలుసు, కాని మేము వారికి పొత్తు ప్రతిపాదన ఇచ్చినందున కనీసం బిజెపి విజయానికి బాధ్యత వహించమని అన్నారు.