జమ్మూ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తావి నదికి ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయి.ఈ సమయంలో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా అధికారులు రక్షించారు. 

జమమూ కాశ్మీర్ రాష్ట్రంలో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో  కార్మికులు పనిచేస్తున్నారు. అయితే తావి నదికి సోమవారం నాడు మధ్యాహ్నం ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా ఇద్దరు కార్మికులు వరదల్లో చిక్కుకొన్నారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

హెలికాప్టర్ సహాయంతో  ఇద్దరిని అధికారులు రక్షించారు. వరదల్లో చిక్కుకొన్న ఇద్దరిని బయటకు తీసుకురావడంతో బాధిత కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు.