మదురై చితిరై ఉత్సవాల్లో విషాద ఘటన జరిగింది. వైగై నదిలోకి కల్లజగర్ భగవానుడు ప్రవేశించే వేడుకలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి మృతి చెందారు.
మధురై : మదురైలోని వైగై నదిలోకి కల్లజగర్ భగవానుడు ప్రవేశించే కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
కాగా, కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుక జరగలేదు. రెడేళ్ల తరువాత ఈ యేడు ఉత్సవాలు జరుగుతున్నాయి. మృతుల్లో ఒకరు మహిళ, ఒక పురుషుడు ఉన్నారు. చనిపోయిన మధ్య వయస్కుడైన వ్యక్తి, మహిళ ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. మృతులకు సంబంధించిన సమాచారం తెలిస్తే తెలియజేయాలంటూ జిల్లా యంత్రాంగం 9498042434 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఇచ్చింది.
ఇక ఈ ఉత్సవంలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. మదురైలోని చితిరై ఉత్సవాల 12వ రోజున, వైగై నదిలోకి కల్లజగర్ భగవానుడు ప్రవేశించే కార్యక్రమాన్ని చూసేందుకు తెల్లవారుజామున 4 గంటల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సముద్రం మధ్యలో, పట్టు వస్త్రాలు ధరించి, భక్తజనసందోహం మధ్య స్వామివారు తన బంగారు గుర్రంపై శనివారం ఉదయం 5.50 నుండి 6.20 గంటల మధ్య వైగై నదిలోకి ప్రవేశించారు.
