Asianet News TeluguAsianet News Telugu

దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకం: ట్విట్టర్‌కి తేల్చి చెప్పిన పార్లమెంటరీకి కమిటీ

లడఖ్‌ను చైనాలో అతర్భాగంగా చూపడంపై ట్విట్టర్ ను జాయింట్ కమిటీ ఆన్ డేటా ప్రొటెక్షన్ కమిటీ ప్రశ్నించింది.  ఈ విషయమై కమిటీ చైర్ పర్సన్ మీనాక్షి లేఖి ట్విట్టర్ ను ఈ విషయమై ప్రశ్నించింది.

Twitter Defence Inadequate: MPs' Panel On Leh In China Location Settings lns
Author
New Delhi, First Published Oct 28, 2020, 3:17 PM IST

న్యూఢిల్లీ: లడఖ్‌ను చైనాలో అతర్భాగంగా చూపడంపై ట్విట్టర్ ను జాయింట్ కమిటీ ఆన్ డేటా ప్రొటెక్షన్ కమిటీ ప్రశ్నించింది.  ఈ విషయమై కమిటీ చైర్ పర్సన్ మీనాక్షి లేఖి ట్విట్టర్ ను ఈ విషయమై ప్రశ్నించింది.

లడ‌ఖ్ ను చైనాలో భాగంగా చూపించడంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ సరిపోదని ఈ కమిటీ అభిప్రాయపడింది. లడఖ్ ను చైనాలో అంతర్భాగంగా చూపించడం భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకమని కమిటీ తేల్చి చెప్పింది. అంతేకాదు దీనికి  ఏడేళ్ల జైలు శిక్షతో క్రిమినల్ నేరానికి సమానమని కమిటీ అభిప్రాయపడింది.

లడఖ్ ను చైనాలో అంతర్భాగంగా చూపించడంపై  డేటా ప్రొటెక్షన్ పై పార్లమెంటరీ ప్యానెల్  ట్విట్టర్ కు నుండి రాత పూర్వకంగా వివరణ కోరింది.భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడం పట్ల ప్రభుత్వం తన నిరాకరణను వ్యక్తం చేసింది. భారతీయ పౌరుల సున్నితత్వాన్ని గౌరవించాలని ఇండియా ట్విట్టర్ ను కోరింది.

ఇటువంటి ప్రయత్నాలు ట్విట్టర్ కు అపఖ్యాతిని కలిగిస్తాయని  కేంద్ర ఐటీ కార్యదర్శి అజయ్ సహానీ అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ తటస్థతపై కూడ అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios