బాయ్ ఫ్రెండ్ ని అతి కిరాతకంగా చంపి.. అతని మృతదేహాన్ని డ్రమ్ములో దాచి.. ఓ హిజ్రా పరారయ్యింది.  ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాటమ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సాఢ్గావ్ నివాసి మొహమ్మద్ జాకిర్ ఇంట్లో ఆరు నెలల క్రితం చాందినీ అనే హిజ్రా అద్దెకు దిగింది. తరువాత తన బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకువచ్చి అక్కడే ఉండసాగింది. 20 రోజుల క్రితం చాందినీ.. ఇంటికి తాళం వేసి.. తాను ఊరు వెళ్తున్నట్లు ఇంటి ఓనర్ కి చెప్పంది. తన బాయ్‌ప్రెండ్ వసీమ్ కూడా బయటకు వెళ్లాడని చెబుతూ యజమానికి తాళం ఇచ్చి వెళ్లిపోయింది. 

అయితే ఆ ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో జాకిర్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలంలో పరిశీలించగా 100 లీటర్ల డ్రమ్ములో యువకుని మృతదేహం కనిపించింది. అది వసీమ్ మృత దేహమని ఇంటి యజమాని గుర్తించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించి, పరారైన హిజ్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.