ఓ మూడేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా తన దగ్గరికి వచ్చిన పామును కసాబిసా కొరికి చంపేశాడు. ఆ తరువాత బాలుడు అస్వస్థత పాలయ్యాడు.
ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము ఆ చిన్నారి దగ్గరికి వచ్చింది. అయితే ఆ బాలుడికి అది పాము అని తెలియదో లేకపోతే.. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పామును పట్టుకుని కసాబిసా కొరికేశాడు. దీంతో ఆ పాము చచ్చి ఊరుకుంది. ఉత్తరప్రదేశ్లోని కొత్వాలీ మహమ్మదాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అక్కడి మద్రాపూర్ గ్రామంలో దినేష్ సింగ్ అనే వ్యక్తికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. దినేష్ సింగ్ తన కొడుకు, తన తల్లిలతో కలిసి ఉంటున్నాడు. శనివారం నాడు ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే అక్కడికి ఓ పాము వచ్చింది. . అది బాలుడి కంటపడింది. అయితే ..దాన్ని చూసి ఎలాంటి భయం లేకుండా దాని దగ్గరకు వెళ్ళాడు బాలుడు. ఆ పామును తన చేతులతో పట్టుకొని.. నోటితో కొరికేసి చంపాడు.
మణిపూర్ హింసాకాండపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. ఏ ఏ అంశాలపై దర్యాప్తు సాగనున్నదంటే..?
అది చూసిన మిగతావారు.. భయంతో పరుగులు పెట్టారు. విషయం బాలుడి కుటుంబసభ్యులకు తెలిపారు. వారు వచ్చేసరికి.. పాము చచ్చిపోయింది కానీ బాలుడికి ఆరోగ్యం దెబ్బతిన్నది. కాసేపటికి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. బాలుడుతో పాటు.. చనిపోయిన పామును కూడా తీసుకొని స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాలుడుని గమనించిన వైద్యులు వెంటనే మెరుగైన చికిత్స అందించారు.
ప్రస్తుతం బాలుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలిసిన గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతకు ముందు ఎప్పుడూ తన మనవడు.. ఇలా విచిత్రంగా ప్రవర్తించలేదని… పామును అలా చేయడం విచిత్రంగా అనిపిస్తుందని.. ఆ బాలుడి నాయనమ్మ సునీతాదేవీ చెప్పింది.
