జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. జిల్లాలోని క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. జిల్లాలోని క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం పాల్గొంటున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జమ్మూ కాశ్మీర్ పోలీసు జవాను వీరమరణం పొందారు’’ కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌కు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం.. శ్రీనగర్‌లోని చనాపోరా ప్రాంతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ LeT/TRFకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను ఖాన్ కాలనీ చనాపొరాకు చెందిన ముస్తాక్ అహ్మద్ గనై కొడుకు అమీర్ ముష్తాక్ గనై ముస్సా, బుత్పోరా చనాపొరాకు చెందిన మహ్మద్ అల్తాఫ్ భట్ కొడుకు అజ్లాన్ అల్తాఫ్ భట్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి 15 పిస్టల్స్, 30 మ్యాగజైన్లు, 300 రౌండ్లు, ఒక సైలెన్సర్ సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
