ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై వర్షాలకు అతలాకుతలమైంది. ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గల పింప్రివాదలో ప్రహారీగోడ కూలి 13 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.

సంఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

థానేలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. పాఠశాల గోడ కూలి ఇళ్లపై పడడంతో ఈ ప్రమాదం సంభవించింది.