చిన్న కూతురుపై తండ్రి అత్యాచారం.. అదే సమయంలో పెద్ద కూతురు లోపలికి రావడంతో..
ఓ తాగుబోతు తన కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని పెద్ద కూతురు చూసి షాక్ కు గురయ్యింది. తండ్రి చేసిన దుశ్చర్యను తల్లికి వివరించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.

కొందరు మగాళ్లు వావి వరుసలు మరిచి మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి సొంత వాళ్లపైనే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. మద్యం తాగే అలవాటు దీనికి మరో కారణమవుతోంది. మద్యం మత్తుల్లో కన్నబిడ్డలు అని కూడా చూడకుండా అత్యాచారినికి ఒడిగడుతున్నారు. తాజాగా రాజస్థాన్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన ఐదేళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. జైసల్వేర్ పట్టణంలోని ఓ కాలనీలో రాకేష్ తన భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి జీవిస్తున్నాడు. పెద్ద కూతురు వయస్సు ఐదేళ్ల కాగా.. చిన్న కూతురు వయస్సు ఎనిమిదేళ్లు. రాకేష్ వ్యవసాయ పనులు చేస్తూ జీవోనోపాధి పొందేవాడు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో అతడు మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం తాగుతూ కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు.
దీంతో రాకేష్ భార్యే ఇంటి బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. స్థానికంగా దొరికే పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో ఇటీవల ఒక రోజు రాకేష్ ఫుల్లుగా మద్యం తాగాడు. తరువాత ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో పెద్ద కూతురు బయటకు వెళ్లింది.. తల్లి పనుల కోసం వెళ్లింది. చిన్న కుమార్తె మాత్రమే ఇంట్లో ఉంది. ఫుల్లుగా మద్యం తాగి ఉన్న రాకేష్ వావి వరసలు మరిచి కూతురపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అదే సమయంలో పెద్ద కూతురు ఇంటికి వచ్చింది. తండ్రి.. తన చెల్లెల్లిపై చేస్తున్న దారుణాన్ని చూసి షాక్ కు గురయ్యింది. ఈ విషయాన్ని వెంటనే తన తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితురాలి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని అరెస్టు చేశారు. చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి రక్షించే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.