మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.  కేవలం పంటిగాటు ఆధారంగా నిందితుడుని పోలీసులు పట్టుకోవడం గమననార్హం. ఈ సంఘటన మహారాష్ట్ర లో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది జూన్ 23వ తేదీన 50ఏళ్ల మహిళ ఇంటికి ఒంటరిగా వెళ్తుతోంది. కాగా... అటుగా వెళ్తున్న లఖన్ దేవ్ కర్(48) అనే వ్యక్తి ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి లాక్కొని వెళ్లి... అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో... బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

అత్యాచార ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. స్థానికంగా ఉండే మురికివాడల్లో గాలించారు. ఓ వ్యక్తిపై అనుమానం కలగగా.... అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారిస్తున్న క్రమంలో నిజం వెలుగుచూసింది.

మహిళపై అత్యాచారం చేస్తున్నప్పుడు బాధితురాలు నిందితుడి ఛాతిపై గట్టిగా కొరికింది. పంటిగాయం కాస్త ఎక్కువగానే అయ్యింది. ఆ మచ్చ ఇప్పటికీ తగ్గకపోగా... అది పోలీసుల కంట పడింది. దాని గురించి పోలీసులు ఆరా తీయగా.. నిందితుడు నిజం అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.