లిఫ్ట్ ఇస్తానంటూ టెంపోలో ఎక్కించుకుని ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన దారుణ ఘటన అసోంలోని గౌహతీలో జరిగింది. ఈ కేసులో నిందితుడిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పజెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్ నహర్ లాగూన్ లో గృహ కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు గురువారం ఉదయం ఇంటి నుంచి పారిపోయి లఖింపూర్ లోని బందర్ దేవాకు చేరుకున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న ఈ బాలికలను గమనించిన టెంపో డ్రైవరు లిఫ్టు ఇస్తానని పిలిచాడు. అమాయకంగా నమ్మిన అమ్మాయిలు టెంపోలో ఎక్కారు. అనంతరం టెంపోలోనే రోజంతా తిప్పాడు. ఈ సమయంలోనే పెద్ద బాలికపై అత్యాచారం చేశాడు. 

దాంతో ఆగకుండా మరో బాలికపై అత్యాచారం చేశాడు. అప్పటికే బాధితులు అరుపులు, కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు బాలికలకు వైద్యపరీక్షలు చేయించి పిల్లల సంరక్షణాలయానికి పంపించారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నిందితుడైనటెంపో డ్రైవరుపై పోక్సో చట్టం కింద  నిందితుడిని అరెస్టు చేశామని లఖీంపూర్ జిల్లా ఎస్పీ లాంగ్నిట్ టెరోంగ్ చెప్పారు.