హైదరాబాద్‌ను క్రూరమైన నిజాం పాలన నుంచి విముక్తి చేసేందుకు పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని కాంగ్రెస్ ఎన్నడూ గుర్తుపెట్టుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.
హైదరాబాద్‌ను క్రూరమైన నిజాం పాలన నుంచి విముక్తి చేసేందుకు పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని కాంగ్రెస్ ఎన్నడూ గుర్తుపెట్టుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. అమిత్ ఆదివారం కర్ణాటకలోని బీదర జిల్లాలోని గోర్టా గ్రామంలో గోర్టా అమరవీరుల స్మారక చిహ్నం, దేశ మొదటి హోంమంత్రి దివంగత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్బంగా తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా అమిత్ విమర్శలు గుప్పించారు.
1948 మే 9న గోర్టాలో జరిగిన భీభత్సాన్ని గుర్తుచేసిన కేంద్రమంత్రి అమిత్ షా దేశానికి స్వాతంత్య్రం వచ్చినా 200 మందిని క్రూరమైన నిజాం ఊచకోత కోశారని చెప్పారు. తనలాంటి భావోద్వేగమైన వ్యక్తికి ఈరోజు తనకు చాలా ముఖ్యమైన రోజని అన్నారు. గోర్టా గ్రామంలోని ప్రజలు రెండున్నర అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు నిజాం సైన్యం చేత వందలాది మంది చంపబడ్డారని చెప్పారు. ఈ రోజు 103 అడుగుల ఎత్తైన త్రివర్ణ పతాకాన్ని ఎవరూ తాకకుండా అదే భూమిలో ఎగురవేయడం జరిగిందని అన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించి వందేళ్లపాటు గుర్తుండిపోయేలా గోర్టా అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేశారని షా గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్‌కు విముక్తి లభించేది కాదని అన్నారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని (సెప్టెంబర్ 17) జరుపుకోవడానికి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నేటికి వెనకాడుతుందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. తెలంగాణలో గత ఏడాది బీజేపీ.. ఈ దినోత్సవాన్ని నిర్వహించిందని చెప్పారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు.
‘‘ఈ రోజు ఇక్కడ 20 అడుగుల ఎత్తైన సర్దార్ సాహెబ్ విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఇది హైదరాబాద్ నుండి నిజాం పాలనను అంతం చేయడంలో ఆయన ఎంత పెద్ద పాత్ర పోషించాడనే దానికి ప్రతీక. దాని ఫలితమే నేడు ఈ బీదర్ భూమి భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్ల హైదరాబాద్ విముక్తి కోసం కృషి చేసిన వారిని ఎప్పటికీ గుర్తించలేదు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ రోజును మరింత చారిత్రాత్మకంగా మారుస్తాం. యడియూరప్ప కర్ణాటకల ముఖ్యమంత్రి కాకముందు నిజాం బానిసత్వం పేరుతో ఈ ప్రాంతమంతా హైదరాబాద్-కర్ణాటక అని పిలుచుకునేవారు. కళ్యాణ్-కర్ణాటక అనే బంగారు పేరు పెట్టడం ద్వారా కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు యడ్యూరప్ప గట్టి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పని దేశమంతటా అయిపోయింది. కర్ణాటకను తన ఏటీఎంగా మార్చాలనుకుంటోంది. మోదీ నాయకత్వంలో బీజేపీ మాత్రమే కర్ణాటకను అభివృద్ధి చేయగలదు’’ అని అమిత్ షా అన్నారు.
రూ. 50 కోట్లతో గోర్టాలో భారీ అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించేందుకు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి.. భారీ స్మారకం నిర్మించబడిన తర్వాత.. పార్టీ తదుపరి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గోర్టాలో జరుపుకుంటుందని తెలిపారు.
అమిత్ షా ఆదివారం కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోర్టా గ్రామంలో గోర్టా అమరవీరుల స్మారక చిహ్నం, దేశ మొదటి హోంమంత్రి దివంగత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్బంగా తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా అమిత్ విమర్శలు గుప్పించారు.