పాట్నా: ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కు 31 ఏళ్లు నిండాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందుగా ఆయన నిరారండంబరంగా పుట్టినరోజును ఇవాళ జరుపుకొంటున్నారు.

బీహార్ లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ), బీజేపీ కూటమి కలిసి పోటీ చేశాయి.సంయమనంతో ఉండాలని పార్టీ నేతలకు తేజస్వియాదవ్ శనివారం నాటి నుండి సందేశం పంపుతున్నాడు. రౌడీ సంస్కృతి నుండి ఆర్జేడీని బయటపడేసేందుకు కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

 

పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకోవాలని తేజస్వియాదవ్ నిర్ణయం తీసుకొన్నాడని ఆర్జేడీ ప్రకటించింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ కూడ తేజస్వియాదవ్ ఇంటి వద్దకు రావొద్దని కూడ ఆర్జేడీ ట్వీట్ చేసింది.ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద నవంబర్ 10న అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ కోరింది. తేజస్వియాదవ్ పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10వ తేదీన వెలువడనున్నాయి. ఈ అసెంబ్లీ ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించాయి.

గతంలో మహాకూటమిలోనే నితీష్ కుమార్ భాగస్వామిగా ఉన్నాడు. కొంత కాలానికి ఆర్జేడీతో తెగతెంపులు చేసుకొన్న నితీష్ బీజేపీతో చేతులు కలిపాడు.