కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్.. సురక్షితంగా బయటపడ్డ పైలట్

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో తేలికాపటి యుద్ధ విమానం తేజస్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం నుంచి పైలట్ కూడా సురక్షితంగా బయటపడ్డారు.

Tejas fighter jet crashes The pilot escaped safely. The incident took place in Rajasthan's Jesalmer..ISR

భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటన నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఆపరేషన్ ట్రైనింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.‘భారత వైమానిక దళానికి చెందిన తేజస్ విమానం జైసల్మేర్ వద్ద శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైంది. పైలట్ సుక్షితంగా బయటపడ్డారు.’ అని వైమానిక దళం ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. 

41 రోజుల్లో 24 రాష్ట్రాలు.. మోడీ సుడిగాలి పర్యటన.. రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం..

కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విమానం నేలకూలిన వెంటనే దానికి మంటలు అంటుకున్నాయి. దట్టమైన, నల్లటి పొగలు వెలువడ్డాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులను పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు.

పోఖ్రాన్ ఎడారికి 100 కిలోమీటర్ల దూరంలో ప్రధాని నరేంద్ర మోడీ, సైనిక ఉన్నతాధికారులు కలిసి 'భారత్ శక్తి' మెగా వార్ గేమ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కల్లా రెసిడెన్షియల్ కాలనీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని జైసల్మేర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర సింగ్ తెలిపారు.

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీ.. 5 గంటలకు ప్రమాణ స్వీకారం..

ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ విమానం వైమానిక పోరాటానికి, వైమానిక మద్దతు మిషన్లకు శక్తివంతమైన వేదిక నిలిచాయి.  తేజస్ విమానాలు ఐఏఎఫ్ కు కీలకం కానున్నాయి. ఇది ఇప్పటికే దాదాపు 40 తేజస్ ప్రారంభ వేరియంట్లను చేర్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios