Asianet News TeluguAsianet News Telugu

టీచర్స్ డే స్పెషల్... ఆక్టోపస్ తో గూగుల్ డూడుల్

ఆక్టోపస్ తో ప్రత్యేకంగా ఈ డూడుల్ ని ఏర్పాటు చేసింది. తరగది గదిలో ఉపాధ్యాయుడు ఏమేమి చేస్తారో ఒకే ఒక్క డూడుల్ అర్థవంతంగా తెలియజేసింది గూగుల్. దీనిలో... ఆక్టోపస్ ఒకేసారి చాలా పనులు చేస్తుంటారు. 

Teachers' Day: Google Doodle honours Dr Sarvepalli Radhakrishnan on birth anniversary
Author
Hyderabad, First Published Sep 5, 2019, 1:09 PM IST

మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 5న టీచర్స్‌ డే సెలబ్రేట్ చేసుకుంటారు భారతీయులు. ఈసారి సెలబ్రేషన్స్‌లో గూగుల్ కూడా చేరిపోయింది. ప్రపంచంలోని టీచర్లందరికీ హోమ్ పేజీలో డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది గూగుల్. 

ఆక్టోపస్ తో ప్రత్యేకంగా ఈ డూడుల్ ని ఏర్పాటు చేసింది. తరగది గదిలో ఉపాధ్యాయుడు ఏమేమి చేస్తారో ఒకే ఒక్క డూడుల్ అర్థవంతంగా తెలియజేసింది గూగుల్. దీనిలో... ఆక్టోపస్ ఒకేసారి చాలా పనులు చేస్తుంటారు. ఈ డూడుల్ లో ఆక్టోపస్ ఉపాధ్యాయుడు అనే అర్థం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ డూడుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

గతేడాది డూడుల్‌పైన ఉన్న గ్లోబ్‌ పైన క్లిక్ చేస్తే ఆ గ్లోబ్ టీచర్‌లా మారుతుంది. స్పోర్ట్స్, మ్యూజిక్, ఫిజిక్స్, అంతరిక్ష శాస్త్రం ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ఐకాన్స్ అన్నీ చుట్టూ కనిపించేలా డూడుల్ ఏర్పాటు చేశారు. 

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న జన్మించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన ఆయన భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆయన జన్మదినాన్ని టీచర్స్‌ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు భారతీయులు. ఈ ఆనవాయితీ 1962లో మొదలైంది. ఈ రోజున విద్యాసంస్థల్లో సంబరాలు చేసుకుంటారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులు తమతమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అందుకే ఈ రోజును గూగుల్ తన స్టైల్‌లో డూడుల్‌తో సెలబ్రేట్ చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios